Mana Enadu: ఖమ్మం జిల్లా కూసుమంచి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తాపడింది. సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై లోక్యాతండా వంతెన వద్ద శనివారం తెల్లవారుజూమున ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తోంది. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణంగా పోలీసులు గుర్తించారు.