Rythu Bandhu: రైతు బంధు రైతుల అకౌంట్లోకి.. మీకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి..!!

మన ఈనాడు: రైతుల అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడ్డాయి. ఒక్కో రైతుకు ఒక్కో విధంగా జమ అయ్యాయి. ఖమ్మం జిల్లాలోని ఒక రైతుకు మాత్రం రూ. 1 మాత్రమే జమ అయ్యింది. దీంతో ఆ రైతు అవాక్కయ్యాడు. 5ఎకరాలలోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే ఈ రైతు బంధు సాయం అందనుంది.

తెలంగాణ సర్కార్ విడుదల చేసిన రైతు బంధు డబ్బులు రైతులు అకౌంట్లో జమయ్యాయి. అయితే ఒక్కో రైతుకు ఒక్కో విధంగా డబ్బులు పడ్డాయి. ఒక రైతుకు రూ.1 మాత్రమే రైతు బంధు సాయం కింద అందించింది. రాష్ట్ర సర్కార్ నుంచి ఇన్ పుట్ సబ్సిడీ కింద ఈ డబ్బులు రైతు అకౌంట్లో జమ అయ్యాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ అధికారులు ఇప్పటికే రైతుల బ్యాంకు అకౌంట్లో రైతు బంధు డబ్బులు జమచేస్తున్నారు. యాసంగి సాగు కోసం ఈ డబ్బులను విడుదల చేసింది.

ఐదేకరాలలోపు పొలం ఉన్న రైతులకు మాత్రమే రైతు బంధు సాయం లభిస్తోంది. గత ప్రభుత్వం రైతు బంధు కింద ఎకరానికి ఏడాదికి రూ. 10వేలు అందించింది. ఈ డబ్బులు రెండు విడతల్లో బ్యాంకు ఖాతాలో జమ అవుతుండేది. అయితే ఈ యాంసంగి సీజన్ మాత్రం రైతుకు రూ. 1 మాత్రమే లభించింది.

Share post:

లేటెస్ట్