మన ఈనాడు: ఎంపీ బండి సంజయ్ మరో విడత యాత్ర చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ నెల 10 నుంచి విజయ సంకల్ప యాత్ర పేరుతో యాత్ర చేపట్టబోతున్నారు. లోక్ సభ ఎన్నికలు జరిగే వరకు యాత్ర జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. కొండగట్టులో మొదలై తంగళ్లపల్లిలో ఈ యాత్ర ముగియనుంది.
BJP MP Bandi Sanjay Vijaya Sankalpa Yatra: తెలంగాణలో అన్ని ఎంపీ స్థానాల్లో కాషాయ జెండా ఎగురవేయాలని బీజేపీ (BJP) అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీని తెలంగాణలో బలోపేతం చేసేందుకు ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) యాత్ర మరోసారి యాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 10 నుంచి విజయ సంకల్ప యాత్ర (Vijaya Sankalpa Yatra) పేరుతో బండి సంజయ్ యాత్ర చేపట్టనున్నారు.
కరీంనగర్ ఎంపీ నియోజకవర్గం (Karimnagar MP Constituency) పరిధిలో యాత్ర చేపడుతున్నట్లు ఎంపీ బండి సంజయ్ తెలిపారు. లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections) జరిగే వరకు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కొండగట్టు వద్ద పూజ చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభం చేయనున్నట్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలో బండి సంజయ్ చేపట్టిన యాత్ర ముగియనుంది.
అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ అత్యవసర సమావేశాలు నిర్వహిస్తోంది. మంగళవారం, బుధవారం భేటీలు కొనసాగనున్నాయి. మండల అధ్యక్షులు ఆపై స్థాయి నేతలకు ఆహ్వానం అందించింది బీజేపీ అధిష్టానం. పార్లమెంట్ అభ్యర్థి ఎవరు అయితే బాగుంటుంది అనే అంశంపై రాష్ట్ర నాయకులు అభిప్రాయ సేకరణ చేపట్టారు. పార్లమెంట్ వారీగా అభిప్రాయ సేకరణకు రాష్ట్ర పదాధికరులతో టీమ్ ఏర్పాటు చేసింది. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభిప్రాయ సేకరణకు వెళ్లారు నేతలు.