Kavitha: భట్టి అన్నా.. ఈ పనులు చేయి..

మన ఈనాడు: 2024-25బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి రూ.20వేల కోట్లు కేటాయించాలని మంత్రి భట్టికి కవిత లేఖ రాశారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. రూ.50 కోట్ల వ్యయంతో ప్రొ:జయశంకర్ బీసీ ఐక్యత భవనాలు నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

Kavitha Letter to Batti: ఎన్నికల వేళ బీసీలకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి పెట్టబోయే బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి 20వేల కోట్ల రూపాయిలు కేటాయించాలని ఈ లేఖలో కోరారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్‌కు చట్టబద్ధత కల్పిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్‌ పేర్కొన్న విషయాన్ని కవిత ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీసీ సంక్షేమానికి రానున్న అయిదేళ్లలో లక్ష కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిప్యూటీ సీఎంకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. 

ప్రతి జిల్లా కేంద్రంలో రూ.50 కోట్ల రూపాయిల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యత భవనాలను నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని భట్టివిక్రమార్కకు రాసిన లేఖలో కవిత విజ్ఞప్తి చేశారు. బీసీల సంక్షేమం కోసం రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌లో రూ.20 వేల కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు అవుతుందన్నారు. బీసీల అభివృద్ధికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పని చేయాలన్నారు. బీసీలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరుతున్నానని లేఖ రాశారు.

మరోవైపు తమ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని.. వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పామని.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికలు మార్చి లేదా ఏప్రియల్‌లో జరగనున్న నేపథ్యంలో.. లోక్‌సభ సీట్ల కోసం అన్ని పార్టీలు తమ వ్యూహలకు పదునుపెడుతున్నాయి. తాజాగా బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ కవిత లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సెషన్స్.. దానిపైనే ప్రధాన చర్చ!

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు(Telangana Assembly special sessions) నేటి (ఆగస్టు 30) నుంచి మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు ఉదయం 10:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు ఉభయసభల్లో తొలుత ఇటీవల మరణించిన MLAలు, మాజీ సభ్యులకు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *