నామినేటెడ్​ పదవుల్లో..ఖమ్మం నుంచి ఈ ఆరుగురేనా..?

మన ఈనాడు: కాంగ్రెస్​ ప్రభుత్వం మరో పదిరోజుల్లో భర్తీ చయబోతున్న నామినేటెడ్​ పదవుల్లో ఖమ్మం జిల్లా నుంచి ఆరుగురితో కూడిన జాబితా సిద్దం అయినట్లు సమాచారం. కాంగ్రెస్​ ప్రభుత్వంలో కీలకమైన మంత్రులు ఖమ్మం నుంచే ఉండటంతో ఆసక్తి మరింత పెరిగింది.ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, మరో సీనియర్​ నేత, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఆశవాహుల జాబితాలో ముందువరుసలో ఉన్నారు.

ప్రధానంగా దశాబ్ద కాలానికి పైగానే పాలేరు సీటుపై రాయల నాగేశ్వరరావు ఆశలు పెట్టుకున్నారు. కానీ ఖమ్మం రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారడంతో పొంగులేటి కోసం పాలేరు సీటును వదలుకున్నారు.గతంలోనూ ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి రాష్ర్ట ప్రభుత్వంలో నామినేటెడ్​ పదవి ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది.

పొంగులేటికి మరో ప్రధాన అనుచరుడైన మువ్వా విజయ్ బాబుకు సైతం మెదటి విడతలోనే అవకాశం లభించబోతుంది. గత ప్రభుత్వంలో మాజీ డీసీసీబీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉంది. లేదా గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో ఎమ్మెల్సీ గా బరిలో దింపే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.

ఖమ్మం డిసీసీబి స్థానాన్ని తుళ్లూరు బ్రహ్మయ్యకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా కూడా బ్రహ్మయ్య పేరును పరిశీలిస్తున్నారు. వైరా నుంచి పొంగులేటి ప్రధాన అనుచరుడు బొర్రా రాజశేఖర్ కు కూడా రాష్ట్ర స్థాయిలో ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కనుంది.
మధిర ప్రాంతానికి చెందిన నేత గత సర్కారు జిల్లా పరిషత్​ చైర్మన్​ పదవిని కట్టబెట్టింది. ఈసారి కూడా అక్కడి నుంచే కోటా రాంబాబును జిల్లా పరిషత్​ చైర్మన్​గా పదవి అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోమంత్రి తుమ్మల వర్గం నుంచి సాధు రమేష్ రెడ్డి నామినేటెడ్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో తుమ్మల గెలుపులో రమేష్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉండటం.. అన్ని పార్టీల వారితో సత్సంబంధాలు కలిగి ఉండటం రమేష్ రెడ్డికి కలిసి రానుంది.

వైఎస్ షర్మిల వర్గం నుంచి కాంగ్రెస్ లో చేరిన వారిలో మాజీ జడ్పీ చైర్మన్ గడిపల్లి కవిత కూడా నామినేటెడ్ పోస్ట్ ఆశావహుల జాబితాలో ఉన్నారు. ఇక ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోటాలో.. జిల్లా డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ నామినేటెడ్ పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో మంచి పదవి ఆయనకు దక్కే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు నగర కాంగ్రెస్ కు పెద్దదిక్కుగా ఉన్న జావెద్ కు కూడా రాష్ట్రస్థాయిలో ఏదో ఒక పదవి రానుంది. ఖమ్మం అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని భావించిన జావెద్ కు తుమ్మల రాకతో నిరాశ ఎదురైంది. అయినా సరే తుమ్మల గెలుపుకోసం విశేషంగా కృషి చేసిన జావెద్ కు మంచి పదవే దక్కే అవకాశం కనిపిస్తోంది.

ఇక జిల్లా నుంచి యువతకు అవకాశం కల్పించాలనుకుంటే.. యువత కోటాలో పొంగులేటి ప్రధాన అనుచరుడు, రైట్ ఛాయిస్ అకాడమీ అధినేత మెండెం కిరణ్ కుమార్ కు ఏదో ఒక నామినేటెడ్ పదవి దక్కే అవకాశాలున్నాయి. యువతను పొంగులేటికి దగ్గర చేస్తున్నారనే కక్ష్యతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో కేసులు పెట్టి వేధించినా పొంగులేటి వైపు గట్టిగా కిరణ్ నిలబడ్డారు. మొన్నటి ఎన్నికల్లో జిల్లా యువతను ఒక్కతాటిమీదకు తీసుకొచ్చి ప్రొ. కోదండరాం ఆధ్వర్యంలో జిల్లాలో భారీ సదస్సులు, నిరుద్యోగులతో పాదయాత్ర, బస్సుయాత్రలను నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపులో కిరణ్ కీలకంగా మారారు. ఒకవైపు పొంగులేటి మరోవైపు తుమ్మల ఆశీస్సులతో పాటు ఉన్నత విద్యావంతుడు కావడం, ఎస్సీ సామాజికవర్గానికి చెందడంతో పాటు, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సుమారు లక్షన్నరకు పైగా నిరుద్యోగులు, యువతలో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండటం కిరణ్ కు కలిసొచ్చే అంశాలు.

Related Posts

కటింగ్‌లు, కటాఫ్‌లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి? 

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను రేవంత్ సర్కార్ న‌ట్టేట ముంచిందని మండిపడ్డారు.  సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని…

డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్.. చంద్రబాబుకు విజ్ఞప్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *