Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల గుర్తింపు.. త్వరలో ప్రత్యేక యాప్ ద్వారా సర్వే

Mana Enadu: తెలంగాణ(Telangana)లో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అందించిన ఇందిరమ్మ ఇళ్ల(Indiramma houses) లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం ఓ ప్రత్యేక యాప్‌(Special App)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం గతంలో లబ్ధి పొందిన వారిని గుర్తించడం సులభం అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని పేదలకు ఇందిరమ్మ ఇళ్లకు కేటాయిస్తామని రేవంత్(CM Revanth Reddy) సర్కార్ ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే ఈ యాప్ ఆధారంగా అధికారులు దీనిపై సర్వే(Survey)ను ప్రారంభించబోతున్నారు. అయితే ఈ యాప్‌ను కేంద్ర ప్రభుత్వమే రూపొందించింది. పీఎం ఆవాస్ యోజన(PM Awas Yojana) కోసం దీన్ని తయారు చేసింది. దీనినే ఇందిరమ్మ ఇళ్ల పథకాని(Indiramma House Scheme)కీ వినియోగించనున్నారు.

 ఆ దరఖాస్తుల పరిశీలన తర్వాతే..

రాష్ట్ర వ్యాప్తంగా 4.16 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మొదటిదశలో నిర్మించాలని సీఎం రేవంత్(Cm Revanth) నిర్ణయించారు. ఇందులో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రజాపాలన(Praja palana) కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని చెప్పారు. ఆ అప్లికేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని CM ఆదేశించారు. మరోవైపు ఇటీవల ఇందిరమ్మ కమిటీ గైడ్‌లైన్స్‌(Indiramma Committee Guidelines)ను కూడా ప్రభుత్వ విడుదల చేసింది. గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను కూడా త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు.

 ‘ఆవాస్’ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా అర్హుల ఎంపిక

నిరుపేదలకు పక్కా ఇళ్లు నిర్మించేందుకు కేంద్రం ప్రభుత్వం(Central Govt) ప్రధానమంత్రి ఆవాస్ స్కీమ్‌ను అమలు చేస్తోంది. ఇందుకోసమే ఓ స్పెషల్ యాప్‌ను తయారు చేసింది. ఇందులో ప్రభుత్వ ఇళ్లకు అర్హత పొందాలంటే దానికి కావాల్సిన అర్హతలను ఫీడ్ చేసి ఉంచారు. ఇవే రూల్స్‌ను రాష్ట్రాలు కూడా పాటించాలని.. అప్పుడే PM ఆవాస్ యోజన నిధులు పొందేందుకు అర్హత ఏర్పడుతుందని కేంద్రం స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రెండు కోట్ల నూతన గృహాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Union Minister Pemmasani Chandrasekhar) తెలిపారు. ‘ఆవాస్’ ఆండ్రాయిడ్ అప్లికేషన్’Awas’ Android application) ద్వారా అర్హుల ఎంపిక పారదర్శకంగా చేస్తామన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *