TSRTC| టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Mana Enadu: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించింది. 21 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటించారు రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్. జూన్ 1, 2024 నుంచి పెంచిన పీఆర్సీ అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. 2017 లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభత్వం ఆర్టీసీ ఉద్యోగులకు 17 శాతం పీఆర్సీ పెంచింది. తాజాగా రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా 53,071 మంది ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. పీఆర్సీ ప్రకటించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వంపై ఏటా రూ. 418.11 కోట్లు అదనపు భారం పడనుంది. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఇటీవల సోషల్ మీడియాలో పల్లె వెలుగు బస్సుల్లో ఎక్స్‌ప్రెస్ టికెట్ కొడుతున్నారని.. ఆర్డినరీ బస్సులను ఎక్స్‌ప్రెస్ బస్సు పేర్లు రాసి టీఎస్‌ఆర్టీసీ నడుపుతుందని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు. జరుగుతున్న ప్రచారం ఫేక్ అని.. ఆ ప్రచారాన్ని ఖండించారు. జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలకు పని లేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Share post:

లేటెస్ట్