Telangana Election: ‘పవర్’​పుల్​ పథకాలు మావి..పెయిల్యూర్​లో కాంగ్రెస్​ మోడల్​:KTR​

మన ఈనాడు: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీల నాయకుల పవర్​పుల్​ పంచ్​ డైలగ్​లతో ప్రచారం చేస్తున్నారు. ఓటర్లును ఆకట్టుకునేందుకు ముఖ్యనేతలు సైతం సంక్షేమ పథకాలు, విమర్శలను సైతం సినిమా డైలగ్​లకు మించి ఉంటున్నాయి. ఇక బీఆర్​ఎస్​ కాంగ్రెస్​ హమీలు ఉత్తిదే అన్ని చెప్పేందుకు ప్రత్యేకంగా రీల్స్​ చేస్తూ సోషల్​ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఓటర్లను ఆకర్శించేందుకు కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లతో ముందుకొస్తోంది. ఆ పార్టీ ప్రకటించిన ముస్లిం, బీసీ డిక్లరేషన్ కుట్రపూరితమని బీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్.. కాంగ్రెస్ మధ్య ఉచిత కరెంట్, గ్యారంటీలు, డిక్లరేషన్ పైనే ప్రచారం జోరుగా నడుస్తుంది. కర్నాటకలో అధికారంలోకి వస్తే రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ ఇవ్వడం లేదని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మొన్న మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నిన్న కామారెడ్డిలో జరిగిన బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ విడుదల చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కుల గణన, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చింది. బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో లక్ష రూపాయలు కేటాయిస్తామంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామన్నారు ఆ పార్టీ నేతలు.

కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ పై బీఆర్‌ఎస్ తీవ్రంగా స్పందించింది. బీసీ డిక్లరేషన్ ఓ కుట్ర పూరిత చర్య అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. ఇది బీసీలకు, మైనార్టీలకు మధ్య గొడవలు పెట్టేదని.. దీని వల్ల బీసీలు, మైనార్టీలు ఇద్దరూ నష్టపోతారని చెప్పారు. ముస్లింలను కలుపుకొని బీసీ కుల గణన చేసి రిజర్వేషన్లు కేటాయిస్తే రాజ్యాంగ పరంగా మైనార్టీలకు రావాల్సిన రిజర్వేషన్లు కోల్పోతారని అన్నారు. అలాగే ముస్లింలను బీసీల్లో కలపడం వల్ల బీసీలు కూడా నష్టపోతారని చెప్పారు కేటీఆర్. అటు బీసీలకు, ఇటు మైనార్టీలకు నష్టం చేకూర్చే విధంగా ఉన్న కాంగ్రెస్ మైనార్టీ డిక్లరేషన్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.

మరోవైపు బీజేపీని సైతం వదిలి పెట్టలేదు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ లు ఎన్నికల సమయంలో బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నాయని, ఇన్నేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న ఆ పార్టీలు బీసీ మంత్రిత్వ శాఖను ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు కేటీఆర్. 12 శాతం రిజర్వేషన్ పెంచుతామంటున్న కాంగ్రెస్ ఆ విషయాన్ని రాహుల్ గాంధీ చేత చెప్పించాలన్నారు. బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు కేటీఆర్.

Share post:

లేటెస్ట్