సినిమా అవకాశాల కోసం ఎదురు చూసే కొత్త దర్శకులతో సినిమాలు చేస్తున్నారు రవితేజ. వంశీ డైరక్షన్లో టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చంది. రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దాంతో బాలీవుడ్ లోనూ గట్టిగానే ప్రమోట్ చేసుకున్నారు టీమ్.
మాస్ రాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ సినిమాలు చేస్తున్నారు రవితేజ. రీసెంట్ గా వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చంది. రవితేజ నటించిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. దాంతో బాలీవుడ్ లోనూ గట్టిగానే ప్రమోట్ చేసుకున్నారు టీమ్. అయితే ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. కలెక్షన్స్ విషయంలో మాత్రం నిర్మాతలు సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రానుందని తెలుస్తోంది.
రవితేజ తన సినిమాలను సీక్వెల్ చేయడానికి ఎందుకో పెద్దగా ఇష్టపడరు. ఆయన సినిమాలు సీక్వెల్ గా వచ్చినవి చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఓ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది. రవితేజ హీరోగా టాలీవుడ్ సక్సెస్ దఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సినిమా రాజా ది గ్రేట్. ఈ సినిమాలో రవితేజ అంధుడు గా నటించారు.
మెహరీన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మంచి విజయాన్నిన్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కించే ప్లాన్ జరుగుతుందట. అయితే ఈ సినిమా సీక్వెల్ ను అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడం లేదని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దాన్లో నిజం లేదని తెలుస్తోంది. రాజా ది గ్రేట్ సినిమాకు అనిల్ దర్శకత్వం వహిస్తున్నారట. కాకపోతే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా కాలం పడుతుందని తెలుస్తోంది. అనిల్ ఇటీవలే బాలయ్యతో కలిసి భగవంత్ కేసరి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. అటు రవితేజ ఈగల్ అనే సినిమా చేస్తున్నాడు. ఆతర్వాత గోపీచంద్ మలినేని సినిమా ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత రాజా ది గ్రేట్ సినిమా ఉండే అవకాశాలు ఉన్నాయని టాక్. త్వరలోనే దీని పై టీమ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.