Telangana Election: హైదరాబాద్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. బీజేపీ గూటికి ఒకప్పటి ఎంఐఎం అభ్యర్థి?

మ‌న ఈనాడుః జూబ్లిహిల్స్ స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్‌కు గాలం వేసింది భారతీయ జనతా పార్టీ. నవీన్‌ను బీజేపీలోకి చేర్చుకునేందకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంతనాలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. సుమారు 40 నిమిషాల పాటు కిషన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ ఏకాంతంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారతున్నాయి. హైదారాబాద్‌లో జూబ్లిహిల్స్ సీట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అనూహ్య రీతిలో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డిని కాదని భారత మాజీ కెప్టెన్ అజారుద్దిన్ సీటు దక్కించుకున్నారు. అటు బీజేపీ నుంచి లంకెల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థిగా మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్‌ రంగంలోకి దిగారు. ఈ సీటుపై గంపెడు ఆశలు పెట్టుకున్న ఎంఐఎం నేత నవీన్ యాదవ్‌ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. దీంతో పోరు ఆసక్తికరంగా మారింది.

అయితే తాజాగా స్వతంత్ర అభ్యర్థి నవీన్ యాదవ్‌కు గాలం వేసింది భారతీయ జనతా పార్టీ. నవీన్‌ను బీజేపీలోకి చేర్చుకునేందకు ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం. ఆయన తండ్రి శ్రీశైలం యాదవ్‌తో తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంతనాలు జరపడం హాట్‌టాపిక్‌గా మారింది. సుమారు 40 నిమిషాల పాటు కిషన్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ ఏకాంతంగా సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

అయితే దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి.. ప్రచారంలో భాగంగా తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నియోజకవర్గ పరిధిలోని సీనియర్ నేతలను కలుస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే శ్రీశైలంను కలిసినట్లు తెలిపారు. ఇదే అంశంపై శ్రీశైలం యాదవ్ సైతం స్పందించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేవలం మర్యాదపూర్వకంగానే తమ ఇంటికి వచ్చారని వెల్లడించారు. అతిథిగా వచ్చిన ప్రతి ఒక్కరిని ఇదే తరహాలో మర్యాద చేస్తామన్నారు. పార్టీలోకి ఆహ్వానించేందుకు మాత్రం కాలేదని స్పష్టం చేశారు. అయితే, ప్రత్యర్థులు వాదనలు మాత్రం మరోలా ఉన్నాయి. నవీన్ యాదవ్‌ను బీజేపీలోకి రావాలంటూ కిషన్ రెడ్డి ఆహ్వానించినట్లు గుసగుసలాడుకుంటున్నారు.

 

Related Posts

మహిళలకు బంపర్ ఆఫర్.. ఎవరు గెలిచినా నెలకు రూ.2,500

మరికొన్ని రోజుల్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections 2025) జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారారు. వారు మొగ్గు చూపే రాజకీయ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు…

రేవంత్.. నువ్వు మగాడివి అయితే నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో చర్చ పెట్టు: KTR

తెలంగాణలో ప్రస్తుతం చర్చంతా బీఆర్‌ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫార్ముల ఈ రేస్ కేసు(Formula E race case)పైనే నడుస్తోంది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంలో మంగళవారం గంటగంటకూ వ్యవహారం మలుపులు తిరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఇష్యూపై KTR మీడియాతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *