Medak: పురిటి నొప్పులతో ఆస్పత్రికి వస్తే తాళం.. కారు చీకట్లో కటిక నేలపైనే..

Mana Enadu:ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినా గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవానికి నోచుకోవడం లేదు. పురిటి నొప్పులతో అర్ధరాత్రి ప్రభుత్వాస్పత్రికి వచ్చిన ఓ ఆడ పడుచుకు కనీసం కాన్పు చేసే దిక్కులేకపోయింది. ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో కారు చీకట్లో కటిక నేలపై వరండాలోనే మహిళ ప్రసవ వేదన పడింది. చివరకు ఆ తల్లి వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్‌ జిల్లా వెల్దుర్తిలో దారుణం జరిగింది.

మెదక్‌ జిల్లా వెల్దుర్తి గ్రామానికి చెందిన తాటి సృజనకు ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో తల్లిదండ్రులు సృజనను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డ్యూటీలో ఉండాల్సిన వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. పైగా ఆస్పత్రికి తాళం వేసి ఉంది. దీంతో ప్రసవ వేదన పడుతోన్న సృజన వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మరుసటి రోజు తెల్లారి (సోమవారం) కూడా డాక్టర్లు మధ్యాహ్నం మూడు గంటల వరకు రాలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ చందు నాయక్‌ను వివరణ కోరగా.. రాత్రి సమయంలో విధులు నిర్వహిస్తున్న సిస్టర్‌ జయంతికి మెమో ఇచ్చామని తెలిపారు. విధులకు గైర్హాజరైన వైద్యుడిపైనా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *