BREAKING: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన

Published on March 12, 2024 6.20 pm by Mokshitha
Mana Enadu: కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసింది రేవంత్ సర్కార్. కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఔటర్ చుట్టూ మహిళా రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.అలాగే కాళేశ్వరంపై న్యాయవిచారణ చేసేందుకు కమిటీ ఏర్పటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన చేసింది. కొత్త రేషన్ కార్డుల జారీకి రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలాగే ఔటర్ చుట్టూ మహిళా రైతు బజార్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అలాగే కాళేశ్వరంపై న్యాయవిచారణ చేసేందుకు కమిటీ ఏర్పటుకు ఆమోదం తెలిపింది.

► ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు

► పార్టీలకు అతీతంగా పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు

► మొదటి విడతలో 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇండ్లు

► తెల్ల రేషన్ కార్డులకు అమోదం

► కొత్తగా 14 బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు

► మహిళ సంఘాలు చేసిన వస్తువుల బ్రాండింగ్ కోసం ORR చుట్టూ 30 ఎకరాల స్థలం

► గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఇరిగేషన్ అవకతవకలపై విచారణ కోసం జస్టిస్ పినాకిని చంద్ర ఘోష్‌తో కమిటీ

► వంద రోజుల్లో ఇరిగేషన్‌పై విచారణ జరిపించాలని క్యాబినెట్‌లో నిర్ణయం.

► 16 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు

► ముదిరాజ్, యాదవ కుర్మ, లింగాయత్, పద్మశాలి, పెరక, బలిజ, రెడ్డి, వైశ్య, మాదిగ, మాదిగ ఉపకులాల, మాల, మాల ఉపకులాలు, ఏకలవ్య, బంజారా, ఆదివాసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు

► గీత కార్మికుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు

► 2008 డీఏస్సీ అభ్యర్థులకు మినిమం పే స్కేల్ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయం.

► వేసవిలో తాగునీటి కోసం ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

► మహిళా సాధికారత కోసం 15 అంశాలతో ప్రత్యేక కార్యక్రమం కోసం క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తెలిపారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *