Mana Enadu:తెలంగాణలోని వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్ నుంచి టీజీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇక నుంచి వాహనాలపై ప్లేట్ పై టీఎస్ కు బదులుగా టీజీగా ఉండనుంది.
సీఎం రేవంత్రెడ్డి అధికారం చేపట్టగానే తెలంగాణ వాహనాల రిజిస్ర్టేషన్ కోసం TSగా ఉన్న స్థానంలో ఇకపై TGగా రిజిస్ట్రేషన్ జరిగేందుకు కేంద్రం అనుమతించాలని కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంగళవారం ఇకపై తెలంగాణలో వాహనాలకు TG గా రిజిస్ట్రేషన్లు చేసేందుకు ఆమోదం లభించింది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రెండు లేదా మూడు రోజుల్లోనే నూతన వాహనాలకు TG పేరుతో రిజిస్ట్రేషన్లు చేయనున్నట్టు తెలిసింది.