గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సోమవారం కమలం గూటికి చేరేందుకు సిద్దం అయ్యారు. తూర్పు హైదరాబాద్ పేరుతో ఇటీవల వేగంగా విస్తరిస్తున్న నియోజవర్గానికి చెందిన ఆఎమ్మెల్యేకి సీఎం కేసీఆర్ సీటు నిరాకరించారు. ఇటీవల కేటీఆర్ పిలిచి మాట్లాడినప్పటికీ స్పష్టమైన హామీనివ్వలేదని అలకగా ఉన్నారు.
ఆదివారం సాయంత్రం రహస్యంగా కాషాయం పార్టీ నేతలతో సమావేశం అయ్యారని విశ్వసనీయ సమాచారం. ఎమ్మెల్సీ ఇచ్చేందుకు ఆపార్టీ నేతలు అంగీకరింనట్లుగా సమాచారం. ఈ అసెంబ్లీ నుంచి అధికారపార్టీ నుంచి ముగ్గురు పొటీపడినప్పటికీ మంత్రి హరీష్‌రావుతో సన్నిహితుగా ఉన్న నాయకుడికే సీటు కేటాయించారు. దీంతో పార్టీ పెద్దలపై మీడియా సమావేశం ఏర్పాడు చేసి దొంగలకే టిక్కెట్లు ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు. ఆతర్వాత మైనంపల్లితో కలిసి కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం జరిగింది.
ఇటీవల రెండు రోజులుగా తనకు అనుకూలంగా ఉన్న పోలీస్ అధికారులను వరుసగా బదిలీలు చేస్తుండటంతోపాటు సంక్షేమ పథకాల పవర్ కట్ చేయడంతో కమలం గూటికి చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారని సమాచారం.