
తెలంగాణ(Telangana)లో 5 రోజులపాటు ఎండల తీవ్రత(Intensity of the sun) మరింత పెరగనుంది. ఉదయం 7-8 గంటలకే ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం సమయాల్లో అయితే రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు(high temperatures) నమోదవుతున్నాయి. ఈమేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Hyderabad Meteorological Centre) హెచ్చరించింది. సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని పేర్కొంది. ఖమ్మం, భద్రాచలంతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి: వాతావారణ కేంద్రం
మెదక్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు హైదరాబాద్ వాతావారణ కేంద్రం(HMC) వెల్లడించింది. కాగా నిన్న (సోమవారం) రాష్ట్రంలో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని పేర్కొంది. రానున్న మూడు నుంచి ఐదు రోజుల పాటు తూర్పు, ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38 డిగ్రీల సెల్సియస్‌కు, ఇతర జిల్లాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంత ఎక్కువగా నీరు(Water) తాగాలని సూచించింది.