
అక్రమ వలసదారుల(Illegal immigrants) ఏరివేత.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్(America President Trump) ఏ క్షణాన మొదలు పెట్టాడో కానీ ఇప్పుడు ప్రపంచం అంతటా ఇదే ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే భారత్(India)తో పాటు పలు దేశాలకు చెందిన అక్రమ వలసదారుల్ని గుర్తించి అరెస్టులు చేసి స్వదేశానికి తమ విమానాల్లోనే పంపేస్తున్నారు. ఇది కొనసాగుతుండగానే అమెరికా మిత్రదేశం బ్రిటన్(Britain) కూడా ఇప్పుడు అదే బాట పట్టింది. అరెస్టులు చేసి అక్రమ వలసదారుల్ని వెళ్లగొట్టే ప్రయత్నాలు మొదలు పెట్టింది.
బ్రిటన్‌లో 19వేల మంది వలసదారులు
స్వదేశంలో భారీగా అక్రమంగా పాగా వేసిన భారతీయ వలసల్ని గుర్తించేందుకు బ్రిటన్ ప్రభుత్వం(Britain Govt) భారీ డ్రైవ్ చేపట్టింది. అమెరికా తరహాలోనే అక్రమ వలసదారులకు ఉపాధి కల్పించే భారతీయ రెస్టారెంట్లు(Indian restaurants), నెయిల్ బార్‌లు, కన్వీనియన్స్ స్టోర్‌ల, కార్ వాష్‌లను లక్ష్యంగా చేసుకుని ఇవాళ దేశవ్యాప్తంగా భారీగా తనిఖీలు చేపట్టింది. బహిష్కరించాల్సిన అక్రమ వలసదారులను బస్సు నుంచి దించి విమానం మెట్లు ఎక్కుతున్నట్లు చూపించే వీడియోను బ్రిటన్ హోమ్ ఆఫీస్(Britain Home Office) ఇవాళ (ఫిబ్రవరి 11) విడుదల చేసింది. అక్కడ దాదాపు 19వేల మంది శరణార్థులు(Refugees), విదేశీ నేరస్థులు ఉన్నట్లు తెలిపింది.
73 శాతం పెరిగిన అరెస్టుల సంఖ్య
బ్రిటన్‌లో ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు(Immigration enforcement teams in Britain) జనవరిలో మొత్తం 828 ప్రాంగణాలపై దాడులు చేసి 609 మందిని అరెస్టు(Arrest) చేసి రికార్డు సృష్టించాయి. గతేడాది జనవరితో పోలిస్తే ఈ దాడులు 48 శాతం పెరిగాయని అధికారులు తెలిపారు. అరెస్టుల సంఖ్య అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 73శాతం పెరిగిందని వెల్లడించారు. తాజాగా ఉత్తర ఇంగ్లండ్(England)లోని హంబర్‌సైడ్‌లో ఉన్న భారతీయ రెస్టారెంట్‌ను ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీలు చేసి ఏడుగురిని అరెస్టు చేసి, మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు హోం ఆఫీస్ వెల్లడించింది.
#WATCH | Delhi: Congress MP and Lok Sabha LoP Rahul Gandhi arrives in the Parliament. pic.twitter.com/NGXROW9tSU
— ANI (@ANI) February 11, 2025