మన ఈనాడు:సీఎం(CM) రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు నగదుతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం ప్రారంభించాలన్నారు.
CM Revanth Reddy: బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ విభాగాలపై ఈరోజు సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి పలువురు మంత్రులు, వివిధ శాఖల అధికారులు హాజరైయ్యారు. ఈ భేటీలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్. ప్రభుత్వ హాస్టల్స్ కు (Government Hostels) అవసరమైన పూర్తి బడ్జెట్ ను అంచనా వేయాలని సీఎం రేవంత్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. అంచనా వ్యయం ఆధారంగా గ్రీన్ ఛానెల్ ద్వారా బడ్జెట్ విడుదల చేద్దామని అధికారులకు తెలిపారు. అలాగే అద్దె భవనంలో కొనసాగుతున్న గురుకుల స్కూళ్ళ (Gurukula Schools) వివరాలు అందించాలని అధికారులను ఆదేశాలు ఇచ్చారు. అవసరమైన చోట సొంత భవనాలు నిర్మించేందుకు భూమిని గుర్తించాలని అధికారులను సీఎం రేవంత్ కోరారు.
తెలంగాణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో ఒక్కటైన కల్యాణలక్ష్మి (Kalyana Lakshmi Scheme), షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇచ్చేలా అంచనాలు రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రూ.లక్షతో పాటు తులం బంగారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. ఒక్కో లోక్ సభ నియోజకవర్గంలో ఒక బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుపై అధ్యయనం చేయాలన్నారు. నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ హబ్ ఏర్పాటు చేయడం ద్వారా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మరింత ప్రయోజనంకలుగుతుందని అందుకోసం బడ్జెట్ ను రూపొందించాలని సీఎం రేవంత్ అన్నారు.