Telangana : 18 ఏళ్ళు దాటిన ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు

మన ఈనాడు: తెలంగాణ ప్రజల ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టింది ప్రభుత్వం. ఈక్రమంలో 18 ఏళ్ళు నిండిన ప్రతీ ఒక్కరికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలని నిర్ణయించింది. వీటిని ఆధార్, ఆరోగ్యశ్రీతో అనుసంధించాలని నిర్ణయం తీసుకున్నారు.

Digital Health Cards : ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Government). ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు(Digital Health Cards) అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల ఆరోగ్య స్థితిగతులపై సమగ్ర సమాచారం అందుబాటులోకి తేవడంతో పాటు ఈ రికార్డుతో మెరుగైన, అత్యవసర వైద్య సేవలు అందించవచ్చు అని ప్రభుత్వం బావిస్తోంది. దీన్ని ఆధార్, ఆరోగ్యశ్రీలతో అనుసంధానం చేయనుంది. కార్డుల జారీలో భాగంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్(Digital Health Profile) సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఇప్పటికే ఆదేశించారు. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అదికారులకు చెప్పారు. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఒక యూనిక్ నంబర్ తో అనుసంధానం చేయాలని సూచించారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించే వీలుంటుందని అన్నారు. అలాగే ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలని సీఎం అధికారులతో చర్చించారు.

ఈ కార్డు ద్వారా వ్యక్తి ప్రస్తుత ఆరోగ్యం, అనారోగ్యాల పరిస్థితులు, చికిత్స, ఉపయోగిస్తున్న మందులు(Medicines), సమస్, డాక్టర్ల అభిప్రాయం లాంటి అంశాలుంటాయి. వీటన్నింటినీ డిజిటల్ రూపంలో రికార్డ్ చేయనున్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్ళినా ఈ కార్డులు పని చేస్తాయి. వీటి ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వివరాలు తెలుసుకుని డాక్టర్లు వైద్యం అందిచడానికి ఉపయోగపడతాయి.

డిజిటల్ హెల్త్ కార్డుల జారీలో భాగంగా సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఎత్తు, బరువు, పొడువు లాంటి వివరాలతో పాటూ రక్త, మూత్ర పరీక్షలు చేసి..ఆరోగ్య సమస్యలు గుర్తించి కార్డుల్లో నమోదు చేస్తారు. సమస్యలుంటే ప్రత్యేక యాప్‌లో నమోదు చేసి చికిత్స అందిస్తారు. హెల్త్ కార్డుల్లో నమోదు అయిన వెంటనే వారికి వైద్య సాయం అందుతుంది. వీటిని ఎక్కడుకు తీసుకెళ్ళినా గుర్తింపు సంఖ్య నమోదు చేయగానే వివరాలు అన్నీ వచ్చేస్తాయి. డిజిటల్‌ డేటాను భద్రపరుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఐటీ విభాగం సమన్వయంతో దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.

Share post:

లేటెస్ట్