పల్లె పల్లెకూ కొప్పుల ప్రజాదర్బార్
– మధ్యవర్తులకు చెక్.. నేరుగా ప్రజలతోనే ములాఖత్
– గెలవగానే అర్హులందరికీ దళిత బంధు
– తొలిరోజు నుంచే నియోజకవర్గ ప్రగతిపై దృష్టి
– సంక్షేమ పథకాల పంపిణీలో ధర్మపురే టాప్
– పథకాలు అందరికీ చేరుస్తానని మంత్రి కొప్పుల హామీ
Mana ఈనాడు వార్త, హైదరాబాద్: ఆరుసార్లు గెలిచి ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు ఆపద్భాందవుడిగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత ఇష్టుడిగా పేరున్న దళిత నేత కొప్పుల ఈశ్వర్‌కు ధర్మపురి ఓటర్లు మరోసారి పట్టం కట్టనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్లెపల్లెలో కొప్పులకు లభిస్తున్న జనాధరణ చూసి.. ఈ గెలుపు తర్వాత వారితో మరింత మమేకం అవ్వాలని కొప్పుల భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆరు మండలాల్లో ఉన్న ప్రతి పల్లెలో కొప్పుల ప్రజా దర్బార్ నిర్వహిద్దామని ఆయన సన్నిహితులతో చెప్పుకొచ్చారట. ఈ కార్యక్రమం ద్వారా ప్రతీ పదిహేను రోజులకోసారి ప్రజలను నేరుగా కలవడంతో పాటు వారి సమస్యలను వినేందుకు అవకాశం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు పథకాల అమలు, లబ్ధిదారులకు అందే మొత్తం వారికే చేరేలా ఆ ప్రక్రియను నేరుగా పర్యావేక్షించుదుకూ నెలవారీ సమీక్ష కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
- ప్రతి పైసా ప్రజలకు చేరేలా..!
ధర్మపురి నియోజకవర్గం సంక్షేమ పథకాల పంపిణీలో అగ్రస్థానంలో ఉంది. ప్రతి గ్రామం నుంచి కనీసం వెయ్యి గడపలు ఏదో ఒక పథకానికి అర్హత పొంది.. లబ్ధి పొందుతున్నాయి. ఇందులో కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికుల పెన్షన్లు లబ్ధి పొందుతున్న వారు ప్రతి ఇంటి నుంచీ ఉన్నారు. వీరందరికీ ప్రతి పైసా చేతికి చేరేలా పారదర్శకతను మరింత పెంచేందుకు కృషి చేయనున్నారు కొప్పుల. ఈ ఎన్నికల ప్రచారంలో చాలాచోట్ల ద్వితీయ శ్రేణి నాయకులపై ప్రజల్లో కాస్త అసహనం గమనించిన కొప్పుల.. ఇకపై ప్రజలకు వారి నుంచి ఎలాంటి సమస్య తలెత్తకుండా పథకాల లబ్ధిదారులకు ప్రతిపైసా చేతికందేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. పథకాల పంపిణీలో పాదర్శకతను పకడ్బంధీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
- దళిత బంధు అందరికీ..
ధర్మపురి నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ ఇటీవలె వరాల జల్లు కురిపించారు. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికీ ఈ పథకాన్ని అందజేస్తామని ప్రకటించారు. దీనిపై గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు.. కేవలం భారాస నేతలకే వస్తుందని.. దళిత సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వీటిపై తీవ్రంగా మండిపడిన మంత్రి కొప్పుల.. అర్హులైన ప్రతీ దళిత కుటంబానికి లబ్ధి చేకూరేలా చేస్తామని హామీ ఇస్తున్నారు.
మూడోసారి ఏర్పడబోతున్న కేసీఆర్ ప్రభుత్వంలో అత్యంత అనుభవమున్న దళిత నేతగా, నిబద్ధత, కార్యదక్షత ఉన్న నేతగా గుర్తింపుతో పాటు సీఎంకు సొంత మనిషిగా గుర్తింపు ఉన్న కొప్పుల మరోసారి కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకోనున్నారు. అయితే మంత్రిగా హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చినప్పటికీ 15 రోజులకోసారి ఒక్కో మండల కేంద్రంగా ఈ దర్బార్ నిర్వహించేందుకు యోచిస్తున్నారు.
- ప్రజా దర్బార్.. ఇకపై జనంలోనే!
గత పద్నాలుగేళ్లుగా ధర్మపురి ఎమ్మెల్యేగా తనను ఆధరిస్తూ వస్తున్న జనానికి కృతజ్ణత చూపడంతో పాటు వారి సమస్యలకు తక్షణ పరిష్కారాలు ఇచ్చేందుకు, మధ్యవర్తులుగా ద్వితీయ శ్రేణి నాయకుల ప్రమేయం లేకుండా జనాలకు మరింత చేరువయ్యేందుకు ప్రజా దర్బార్ నిర్వహించే యోచనలో ఉన్నారు కొప్పుల. మూడోసారి ఏర్పడబోతున్న కేసీఆర్ ప్రభుత్వంలో సీనియర్ దళిత నాయకుడిగా, సీఎంకు సొంత మనిషిగా గుర్తింపు ఉన్న కొప్పుల మరోసారి కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకోనున్నారు. అయితే మంత్రిగా హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చినప్పటికీ 15 రోజులకోసారి ఒక్కో మండల కేంద్రంగా ఈ దర్బార్ నిర్వహించేందుకు యోచిస్తున్నారు.