KTR: ప్రభుత్వం ఎలా నడుపుతారో చూస్తాం.. ఇప్పుడు అసలు ఆట: కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

మన ఈనాడు: సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎలా నడుపుతుందో చూస్తామని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉంది అసలు ఆట అని అన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు వారాల్లో రుణమాఫీ చేస్తామన్న రాహుల్ గాంధీ హామీ ఏమైందని ప్రశ్నించారు.

ఈ రోజు మీడియాతో చిట్ చాట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పుడు ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో (Congress Government) ఏనాడూ పద్దు మీద చర్చ జరగలేదన్నారు. ప్రతీ ఏడాది పీఏసీ, కాగ్ రిపోర్ట్స్ ఇచ్చామన్నారు. ఏటా ఆడిట్ లెక్కలు తీస్తున్నట్లు చెప్పారు. లెక్కలు వేసుకొని హామీలు ఇస్తారా?.. హామీలు ఇచ్చి లెక్కలు వేసుకుంటారా? అని ప్రశ్నించారు. తాము ప్రతీ ఏడాది పద్దులపై శ్వేత పత్రం విడుదల చేశామన్నారు.

రేపు గవర్నర్ ప్రసంగంలోనూ ఇదే పాత చింతకాయ పచ్చడి చెప్తారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసి మాకు ఇచ్చారని చెప్తారన్నారు. ఓ ఎమ్మెల్యే నియోజకవర్గం లో 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నాడన్నారు. ఎలా ఇస్తారంటే ఇస్తామని చెప్తున్నాడన్నారు. ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ బరువు వాళ్లకు తెలియాలన్నారు.

ఇప్పుడు ఉంది అసలు ఆట అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు కేటీఆర్. రెండు లక్షల రుణమాఫీ అధికారం లోకి వచ్చిన రెండు రోజుల్లోనే చేస్తానన్న రాహుల్ గాందీ హామీ ఏమైందని ప్రశ్నించారు. మొదటి మంత్రి వర్గంలోనే ఆరు గ్యారంటీ లకు చట్టబద్దత తెస్తమన్న హామీ ఎక్కడ? అని అన్నారు.

Related Posts

కటింగ్‌లు, కటాఫ్‌లు తప్ప.. రేవంత్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేంటి? 

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ఏడాది పాల‌న‌పై ఎక్స్ వేదికగా మరోసారి నిప్పులు చెరిగారు. ఇచ్చిన హామీలు అమ‌లు చేయ‌కుండా ప్ర‌జ‌ల‌ను రేవంత్ సర్కార్ న‌ట్టేట ముంచిందని మండిపడ్డారు.  సంక్షేమ ప‌థ‌కాల‌కు కోత‌లు, క‌టాఫ్‌లు పెడుతూ.. అభివృద్ధిని గాలికి వ‌దిలేశార‌ని…

డిప్యూటీ సీఎంగా నారా లోకేశ్.. చంద్రబాబుకు విజ్ఞప్తి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) వైఎస్ఆర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. కడప ఎయిర్ పోర్టులో జిల్లా నేతలు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. కడప నుంచి హెలికాప్టర్ లో చంద్రబాబు మైదుకూరు చేరుకున్నారు. మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి (NTR…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *