Mana Enadu:ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని టైటిల్ రోల్‌లో నటిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
పూరీ, రామ్(Ram Pothineni)కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) సూపర్ హిట్ కొట్టిన నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్‌పైనా భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ ఫేమ్ సంజయ్ దత్ ఈ మూవీలో విలన్ రోల్‌లో ఎంటర్‌టైన్ చేయనున్నాడు. రామ్‌తోఈసారి హీరోయిన్ కావ్య థాపర్ స్ర్కీన్ షేర్ చేసుకోనుంది. మ్యూజిక్ మాస్ట్రో మణిశర్మ సంగీతం అందించారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్టేడ్ వచ్చింది. తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్‌ను రామ్ పూర్తి చేశారు. ఈ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. రామ్ తన పాత్రలో ఒదిగిపోతూ.. ‘‘మామ మాస్క్ ఉంటే నీకు దొంగోడు మాత్రమే కనపడతడు.. మాస్క్ లేకుంటే నీకు మిండెడు కనపడతడు’’ అంటూ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.