Nindha| క్రైమ్​ మిస్టరిగా వరుణ్ సందేశ్ ‘నింద’

Mana Enadu:కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ‘నింద’ అనే చిత్రం రాబోతోంది. వరుణ్ సందేశ్ ఈ చిత్రంలో హీరోగా నటించారు. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన ఈ మూవీని రాజేష్ జగన్నాథం నిర్మించడమే కాకుండా కథ, కథనాన్ని రాసి దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఆడియెన్స్‌లో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసాయి.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను విలక్షణ నటుడు నవీన్ చంద్ర విడుదల చేశారు. టీజర్ విడుదల చేసిన అనంతరం చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. టీజర్ బాగుందని టీంను మెచ్చుకున్నారు. ‘జీవితంలో కొన్ని సార్లు తప్పని తెలిసినా చేయక తప్పదు’.. అనే డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్‌లో ఎన్నో కోణాలున్నాయి. అందమైన ప్రేమ కథ కనిపిస్తోంది. దాంతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్ ఎంతో న్యాచురల్‌గా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆర్ఆర్ అయితే మూడ్‌కు తగ్గట్టుగా సాగింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ను ఫీల్ అయ్యేలా నేపథ్య సంగీతం సాగింది.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతూన్నారు.

నటీనటులు : వరుణ్ సందేశ్, ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్దార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై, శ్రేయా రాణి రెడ్డి, క్యూ మధు, శ్రీరామ్ సిద్దార్థ్ కృష్ణ, రాజ్ కుమార్ కుర్రా, దుర్గా అభిషేక్ తదితరలు

సాంకేతికబృందం
బ్యానర్ : ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్,నిర్మాత : రాజేష్ జగన్నాథం
రచన, దర్శకత్వం : రాజేష్ జగన్నాథం,సంగీతం : సంతు ఓంకార్
కెమెరామెన్ : రమీజ్ నవీత్,ఎడిటింగ్ : అనిల్ కుమార్
క్యాస్టూమ్ డిజైనర్ : అర్చనా రావు,సౌండ్ డిజైన్ : సింక్ సినిమా
పీఆర్వో : ఎస్ఆర్ ప్రమోషన్స్ ( సాయి సతీష్)

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *