Vidya Vasula Aham| అహం లేకుండా..ఆ సినిమా ఆహాలోకి వచ్చేస్తుంది!

Mana Enadu:ఆహాలో(Aha) రెగ్యులర్ గా కొత్త కొత్త షోలు, సినిమాలు సందడి చేస్తాయి. తాజాగా మరో కొత్త సినిమా రాబోతుంది. రాహుల్ విజ‌య్‌, శివాని రాజ‌శేఖ‌ర్‌లు జంట‌గా తెరకెక్కిన సినిమా ‘విద్య వాసుల అహం’ ఆహా ఓటీటీలో మే 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఎటర్నిటి ఎంట్రెర్టైన్మెంట్ బ్యానర్ పై లక్ష్మి నవ్య, రంజిత్ కుమార్ నిర్మాతలుగా మణికాంత్‌ గెల్లి ద‌ర్శ‌క‌త్వంలో ఈ విద్యా వాసుల అహం సినిమా తెరకెక్కింది.

రాహుల్​, శివానీలు పెళ్ళైన కొత్త కాపురాన్ని లీడ్ చేస్తున్నారు, చివరికి ఆ ఈగోస్ నుండి ఎలా బయటకి వచ్చారు అనే కథతో, ఇంటరెస్టింగ్ టైటిల్ తో “విద్య వాసుల అహం” వివాహం అని క్రియేటివ్ గా వచ్చేలా టైటిల్ డిజైన్ చేశారు, కాప్షన్ కూడా లాంగ్ లాంగ్ ఈగో స్టొరీ అని కథలో క్యారక్టర్లకి తగట్టుగా పెట్టి ట్రైలర్ విడుదల చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది.సమ్మర్ లో మంచి రిలాక్సేషన్ ఇచ్చే సినిమాలా ఉంది అని, హాట్ సమ్మర్ లో కూల్ హిట్ అని నేటీజనులు కామెంట్స్ చేస్తున్నారు.

కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకీ స్క్రిప్ట్ రాయడం వలెనే నేను సినిమా చెయ్యగలిగానని డైరెక్టర్ మనికాంత్ గెల్లి అన్నారు. ఈ సినిమాకి సోల్ మొత్తం మ్యూజిక్, కళ్యాణీ మాలిక్ గారు 4 పాటలని నాలుగు విధాలుగా కంపోస్ చేశారు. స్పెషల్లీ పెళ్లి తరవాత పాట నాకు చాలా ఇష్టం.

మే 17న మీరు థియేటర్స్ కి వెళ్ళాలిసిన అవసరం లేదు ..ఎటువంటి అహం లేకుండా మేమే మీ ఇంటికి వస్తున్నాం, ఆహా లో తప్పకుండా చూడొచ్చుంటున్నారు.సరదాగా హాయిగా సమ్మర్లో ఇంట్లో AC వేసుకుని ఆహలో హ్యాపీగా ఫ్యామిలీతో చూసే సినిమా. కొత్తగా వచ్చే ప్రతి యాక్టర్ కి లైఫ్ లో కొన్ని సినిమాలు చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అలా నాకు కూడా వెంకటేష్ గారిలా ఫ్యామిలీ స్టోరీస్ చెయ్యాలని ఉందని హీరో రాహుల్​ అన్నాడు.

రెండు సంవత్సరాల నుండి ఈ టీంతో అనుబంధం ఉందని శివానీ తెలిపింది. ఇప్పుడు నా విద్య వాసుల అహం కూడా ఆహా లోనే వస్తుంది, నాకు నిజంగా ఆహ ఒక లక్కీ ప్లాట్​ పామ్​. రాహుల్ నాకు చిన్నప్పటి నుండి తెలుసు, రాహుల్ మంచి రైటర్ కూడా, రాహుల్ ఒకే చేసాడు అంటే కథ బాగుంటుంది అని అర్ధమైంది, నేను కూడా ఒకే చేశాను, ఈ కథ ఒప్పుకున్న 6 డేస్ కి కోట బొమ్మాలి ఒకే అయ్యింది, అలా లాస్ట్ రెండు సంవత్సరాలుగా రహుల్తోనే వర్క్ చేశాను. ఏ మాత్రం ఈగో లేని వ్యక్తి రాహుల్.

Share post:

లేటెస్ట్