Movie Theaters | తెలంగాణలో సినిమా థియేటర్స్ బంద్..

ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు సమ్మర్ నుంచి వాయిదా వేసుకున్నారు. దీంతో చిన్నా చితకా సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వసాగాయి. కానీ ఆ సినిమాలను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్స్ లో చిన్న సినిమాలు వేస్తే థియేటర్స్ కి ఎవ్వరూ రావట్లేదు, ఓ పది మంది వచ్చినా ఆ కలెక్షన్స్ కరెంట్, రెంట్ లకు కూడా రావట్లేదు. సమ్మర్ మొదలైనప్పటి నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ భారీ నష్టాలని చూస్తున్నాయని యాజమానుల వాపోతున్నారు.

దీంతో తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఓ నిర్ణయానికి వచ్చాయి. సమ్మర్ అయిపోయే వరకు ఓ పది రోజులు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్స్ కి జనాలు ఎవ్వరూ రావట్లేదని కారణంతోనే థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో చిన్న సినిమాలకు దొరికిన ఛాన్స్ కూడా పోతుంది, చిన్న సినిమాలకు ఎఫెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. పది రోజులు అంటే ఈ వారం, వచ్చే వారం రిలీజ్ కి కూడా పలు చిన్న సినిమాలు ఉన్నాయి.

సింగిల్​ స్ర్కీన్​ నడుస్తున్న థియేటర్స్​ ఆవరణలో క్యాంటిన్ల్​తోపాటు హోటళ్లు, ఇతర వాణిజ్య వ్యాపారాలు నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రేక్షకులు లేని థియేటర్స్​ నడిపించడం చాలా భారంగా ఉందన్నారు. అందుకే పదిరోజులు పాటు థియేటర్స్​ మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.

Related Posts

బాక్సాఫీస్ వద్ద ‘డాకు మహారాజ్’ హవా.. రూ.150 కోట్లు వసూల్

నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. తొలిరోజు నుంచే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లతో ఈ…

శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత

కేరళలోని శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయాన్ని అధికారులు మూసివేశారు. మండలపూజ, మకర విళక్కు వార్షిక పూజలు ముగియడంతో సోమవారం ఉదయం ఆలయాన్ని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వమ్ బోర్డు (TDB) వెల్లడించింది. పందలం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *