Tillu Square Twitter Review: ప్రేక్షకులతో విజిల్స్ వేయించిన ‘డీజే టిల్లు’ మూవీకి సీక్వెల్ అయిన ‘టిల్లు స్క్వేర్’ మూవీ ఈ రోజు థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది. సిద్దూ జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి మల్లిక్ విమల్ దర్శకత్వం వహించారు.
ఫస్ట్ పార్ట్ మంచి హిట్ అందుకోవడంతో సెకండ్ పార్ట్‌పై మొదటి నుంచి పాజిటివ్ బజ్ ఉంది. ఇక ఈ మూవీ నేడు రిలీజ్ కావడంతో పలువురు ట్విట్టర్ వేదికగా రివ్యూలు పెడుతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో మాత్రం సినీ ప్రియులు ఈ మూవీపై రివ్యూ ఇస్తున్నారు. అందులో ఓ నెటిజన్.. టిల్లు స్క్వేర్ మూవీ చాలా ఫన్‌గా ఉందని.. సిద్దు పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని అన్నాడు. అంతేకాకుండా ‘డీజే టిల్లు’లో రాధికగా అలరించిన నేహాశెట్టి ఎంట్రీ సీన్ అందరినీ సర్ప్రైజ్ చేసిందన్నారు.
అలాగే మరొకరు రాస్తూ.. టిల్లు స్క్వేర్ మూవీ ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్‌గా ఉందని అన్నారు. అయితే సిద్దు మాత్రం తన ఎనర్జిటిక్ అవతార్‌లో దుమ్ము దులిపేశాడని ఈ మూవీని సిద్దు తన భుజాలపై మోశాడని అంటున్నారు.