చెంగిచర్ల ఘటనలో గాయపడిన మహిళా కుటుంభాలను కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతాపార్టీ నాయకుడు బండి సంజయ్ బుధవారం పరామర్శించారు. ఓ వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసి నాలుగు రోజులు గడుస్తున్న నిందితులను అదుపులోకి తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు.
బండి సంజయ్ పర్యటన చెంగిచర్లలో ఉద్రిక్తతగా మారింది. హోళీ వేడుకలు జరుపుకుంటున్న కుటుంభాలపై ఓవర్గం కావాలనే దాడులకు తెగబడిందని ఆరోపిస్తూ పెద్ద నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పరామర్శించారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా రాచకొండ పోలీసులు పెద్ద ఎత్తున పికెటింగ్ నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ పర్యటన అడ్డుకోవడంతో బారికేడ్లు దూకి చెంగిచెర్ల చేరుకున్నారు. మేడిపల్లి పోలీసులు నిందితులను త్వరలోనే అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈకార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.మేకల శిల్పారెడ్డి పాల్గొన్నారు.