CM Revanth Reddy: అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Mana Enadu: ప్రజలకు జవాబుదారి పాలన అందిస్తూ, ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా పని చేయాలని CM రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ఉన్నతాధికారులను ఆదేశించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణను తీర్చిద్దాల్సిన గురుతరమైన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో అయిదు గ్యారంటీలను అమలు చేసిందని సీఎం చెప్పారు. తర్వాత వంద రోజులు ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ కార్యక్రమాలు, పనులు నిలిచి పోయాయని, ఇకపై అధికారులు విధిగా పరిపాలనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు.

సచివాలయంలో 29 విభాగాల కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించి తీసుకోవలసిన చర్యలపై దిశానిర్ధేశం చేశారు. ఇకనుంచి తాను స్వయంగా వారానికి ఒక జిల్లా పర్యటిస్తూ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులతో పాటు క్షేత్ర స్థాయిలో వివిధ కార్యక్రమాల అమలు తీరును స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు.

జిల్లాల్లో చాలాచోట్ల కలెక్టర్లు ఆఫీసులు దాటడం లేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. విధిగా కలెక్టర్లు కూడా క్షేత్ర పర్యటనకు వెళ్లాలని ఆదేశించారు. ఆసుపత్రులు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ సేవలందించే అన్ని విభాగాలను అప్పుడప్పుడు పరిశీలించాలని చెప్పారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులు, అనూహ్యంగా జరిగే సంఘటనల సందర్భంగా సత్వరమే స్పందించాలని అన్నారు.

 

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *