CM Revanth Reddy : రైతు బంధు‌పై సీఎం రేవంత్ కీలక ప్రకటన

TG: రైతు బంధుపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. మే 9వ తేదీ వరకు రైతులందరి ఖాతాల్లోకి రైతు బంధు డబ్బును జమ చేయనున్నట్లు చెప్పారు. అలా చేయకుంటే మే 9న అమరవీరుల స్థూపం వద్ద రైతులకు క్షమాపణలు చెప్తాను.. అందరి డబ్బు జమ అయితే కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని అన్నారు.

Rythu Bandu : తెలంగాణ(Telangana) లో రాజకీయ నేతల నడుమ సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా లోక్ సభ ఎన్నిక(Lok Sabha Elections) ల ప్రచారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మాజీ సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమి చెందిన తరువాత రైతులు గోస పడుతున్నారని.. ఇప్పటికి వరకు రైతులకు రైతు బంధు డబ్బు జమ కాలేదని ఎన్నికల ప్రచారాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్న ప్రచారాన్ని ఖండించారు.

రైతు భరోసా (రైతు బంధు) పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్. తెలంగాణలో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 69 లక్షల మంది రైతులు ఉంటే.. 65 లక్షల మందికి రైతు భరోసా వేసినట్లు చెప్పారు. మిగతా నాలుగు లక్షల మందికి ఈ నెల 8వ తేదీ లోపల రైతు భరోసా వేస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీ లోగా ఒక్కరైతుకైనా బకాయి ఉంటే అమర వీరుల స్థూపం ముందు ముక్కు నెలకు రాస్తానని అన్నారు. రైతులందరికీ రైతు భరోసా నిధులు అందితే కేసీఆర్ ముక్కు నెలకు రాసి క్షమాపణలు చెబుతారా? అని సవాల్ విసిరారు.

ఈ నెల 9వ తేదీ లోపు ఆసరా పెన్షన్లు కూడా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్టు సీఎం చెప్పారు. గతంలో చెప్పినట్టు గానే ఆగస్టు 15 లోగా రైతులందరికీ రుణమాఫీ చేసి తీరుతామని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపును అడ్డుకోవాలని బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. ఈ రెండు పార్టీల కుట్రను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. గత 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిందని చురకలు అంటించారు.

Share post:

లేటెస్ట్