GHMC Mayor: కాంగ్రెస్​లోకి గ్రేటర్​ మేయర్​..మరో పదిమంది కార్పొరేటర్లు ఎప్పుడంటే..

Greater Hyderabad Mayor: గ్రేటర్​ హైదరాబాద్​ మున్సిపల్​ కార్పొరేషన్​ (GHMC)పై సీఎం రేవంత్​రెడ్డి టార్గెట్​ చేశారు. ఈక్రమంలోనే శనివారం సీఎం రేవంత్​రెడ్డి నివాసంలో హైదరాబాద్​ మేయర్​ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్​లో చేరారు. ఆమెకు ఏఐసీసీ ఇంఛార్జీ దీపా మున్షీ కాంగ్రెస్​ కండువా కప్పి స్వాగతం పలికారు. తండ్రి కేకే త్వరలోనే పార్టీలో చేరబోతున్నట్లు విజయలక్ష్మీ తెలిపారు. మరో పది మంది కార్పొరేటర్లు రెండురోజల్లోనే చేరతారని ప్రకటించారు. మంత్రి కొండా సురేఖతోపాటు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి ఉన్నారు.

Share post:

లేటెస్ట్