Super Police CI GOPI: ఎగిసిపడే నిప్పుల్లోకి దూకి..ప్రాణాలు కాపాడిన ఖాకీ

Warangal: ప్రజల ప్రాణాలు రక్షించేందుకు ఓ పోలీస్​ తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎగిసిపడుతున్న మంటల్లోకి దూకి ప్రాణాలు కాపాడిన ఘటన వరంగల్​ జిల్లాలో జరిగింది.

వరంగల్ పోచమ్మ మైదాన్ లో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మట్టెవాడ పోలీస్​ స్టేషన్​ (Matwada Police Station) సీఐ గోపి( CI Gopi) విధులు నిర్వహించారు. ఒకవైపు ఉవ్వెత్తును మంటలు ఎగిసి పడుతున్నా మంట్లో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయలేదు. దట్టమైన పోగులతోపాటు మంటలు వ్యాపించిన షట్టర్​కు ఉన్న అద్దాలు పగలుగొట్టి లోపలకి వెళ్లాడు సీఐ. ఎస్.బీ.ఐ లైప్ ఇన్సూరెన్స్​ ఉద్యోగులతో పాటు దుకాణ:లోని యజమానులను బయటకు తీసుకు వచ్చారు.

సీఐ తుమ్మ గోపి సమయస్పూర్తితో వ్యవహరించడంతో ప్రాణనష్టం వాటిల్లలేదని పలువురు కొనియాడారు. సీఐ చూపిన చొరవను రాష్ర్ట మంత్రి కొండా సురేఖతో పాటు పలువురు అభినందించారు. సీఐ గోపీతో పాటు కానిస్టేబుల్, ఫైర్ సిబ్బందిని ప్రశంసించారు.

వరంగల్ జకోటియా కాంప్లెక్స్ లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో మంటలు ఆర్పే క్రమంలో మట్టెవాడ సీఐ తుమ్మ గోపి ఊపిరి ఆడక అస్వస్థతకు గురయ్యారు. ఫైర్ హోంగార్డు గిరి చేయి కాలిపోగా ఇద్దరినీ 108లో ఎంజీఎం దవాఖానకు తరలించారు.

గోపి ఖమ్మం జిల్లాలో సబ్​ ఇన్​స్పెక్టర్​గా పనిచేశారు. అక్కడ ఓ రిజర్వాయర్​లో దూకిన వ్యక్తి ప్రాణాలు సైతం కాపాడటం జరిగింది. అంతేగాకుండా ఖమ్మం(Khammam) జిల్లాలో సైతం పనిచేశారు. వైరా (Wyra)సర్కిల్​ కేంద్రంగా పనిచేసినప్పుడు సైతం పోలీస్​శాఖల తమదైన గుర్తింపును అనతికాలంలోనే సాధించిన ఘనత ఇప్పటి సీఐ గోపికే సొంతం.

Share post:

లేటెస్ట్