Hyderabad: మెట్రో ప్రయాణీకులకు షాక్.. ఈ ఆఫర్లు, రాయితీలను రద్దు

హైదరాబాద్‌లోని మెట్రో ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మెట్రో అధికారులు మెట్రో కార్డులు, హాలిడే కార్డులపై ఉన్న రాయితీలను రద్దు చేశారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడనుంది.

హైదరాబాద్‌లోని మెట్రో ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురైంది. మెట్రో అధికారులు మెట్రో కార్డులు, హాలిడే కార్డులపై ఉన్న రాయితీలను రద్దు చేశారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. హైదరాబాద్ రోజు రోజుకు విశ్వనగరంగా మారుతోంది. దేశ, విదేశాల నుంచి అనేక మంది ఉద్యోగ, వ్యాపార ఇతర పనుల నిమిత్తం భాగ్యనగరానికి వస్తూ ఉంటారు. అయితే వారిని సురక్షితంగా, సుఖవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు మెట్రో అనేక రకాలుగా దోహదపడుతుంది. పైగా నగరంలో రోజు రోజుకు విస్తరిస్తున్న ట్రాఫిక్ రద్దీని ఎదుర్కోకుండా ప్రజలు, ఉద్యోగులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మెట్రో రైలు హైదరాబాద్ వాసులకు ప్రాథమిక రవాణా మార్గంగా మారింది. దీంతో ఉదయం, సాయంత్రం, రద్దీ వేళలతో పాటు సెలవు దినాల్లోనూ మెట్రో ప్రయాణం ప్రత్యేక ఆదరణ పొందింది.

వేసవి తాపంతో గత కొద్దిరోజులుగా మెట్రో కోసం మొగ్గు చూపుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. బస్సుల కోసం ఎదురు చూడకుండా, ఎండలో కష్టమైన ప్రయాణానికి చెక్ పెట్టి హాయిగా ఏసీలో త్వరగా గమ్యస్థానాన్ని చేరవేసే మెట్రో వైపుకు అడుగులు వేస్తున్నారు నగర వాసులు. ఇలాంటి అద్భుతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించిన హైదరాబాద్ మెట్రో రైల్ తాజాగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఇలాంటి వారిని కలవరపెడుతోంది.

Share post:

లేటెస్ట్