GHMC: హైదరాబాద్‌లో నగరంలో మధ్యాహ్నం నుంచి వర్షం దంచి కోడుతుంది. గంటపాటు వర్షం ఆగింది. మళ్లీ సాయంత్రం ఆరుగంటల నుంచి భారీ వర్షం పడనుందని వాతావరణశాఖ వెల్లడించింది.
ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకొని ముందుగా వెళ్లాలని GHMC అధికారులు సూచించారు. ప్రధాన రహాదారుల నుంచి వరదనీరు పారుతుందన్నారు. మ్యాన్‌హోళ్లు తెరుచుకునే అవకాశం ఉందని జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీళ్లను క్లియర్ చేస్తున్నామని పేర్కొన్నారు. గంట సమయంలో వర్షానికి సంబంధించి 70 కి పైగా ఫిర్యాదులు వచ్చాయని జీహెచ్ఎంసీ పేర్కొంది.
బంజారాహిల్స్ లోని ఉదయ నగర్ కాలనీలో కొట్టుకుపోయిన నాలా రిటైనింగ్ వాల్ దగ్గరకి జిహెచ్ఎంసి సిబ్బంది చేరుకుని మరమత్తులు చేపట్టినట్లు GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపింది.
GHMC కంట్రోల్ రూం నెంబర్ – 040-21111111,9000113667 జనం వరద సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నెంబర్లుకు ఫొన్ చేయాలని కోరారు.