Malkajgiri: ఇళ్ల మధ్యే పేలుళ్లు..ఉలిక్కిపడ్డ ప్రజలు

హైదరాబాద్‌లో బుధవారం తెల్లవారుజామున వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) జరిగాయి. ఆయిల్ గోదాంతోపాటు ప్లాస్టిక్ పరిశ్రమలో సంబవించింది. మల్కాజ్‌గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆయిల్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నారు. మంటలు అంటుకున్న వెంటనే ఆయిల్ గోదాం నుంచి పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు.


మరోవైపు కాటేదాన్‌లో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. నేటి తెల్లవారుజామున మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా నగర్‌లోని విమల్ ప్లాస్టిక్ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు నల్లటి పొగ పరిసర ప్రాంతమంతా దట్టంగా వ్యాపించింది.


హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. రెండు ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాటేదాన్‌లో ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల మాదిరిగా పరిశ్రమలు వెలిశాయి. ముందస్థు కనీస జాగ్రత్తలు సైతం పట్టించుకునే వారు లేరు. దాని ఫలితమే తరుచు చోటు చేపుకుంటున్న అగ్నిప్రమాదాలు. అయితే ఈ తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాదాల్లో జరిగిన నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు.

Related Posts

Mahakumbh: కుంభమేళా తొక్కిసలాట.. సహాయక చర్యలపై PM మోదీ ఆరా

మహా కుంభమేళా(Mahakumbha Mela) ప్రపంచంలోనే అతిపెద్ద అధ్యాత్మిక కార్యక్రమం. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహత్తర వేడుక. కోట్లాది మంది తరలివచ్చే బృహత్తర ఆధ్యాత్మిక ఉత్సవం. 45 రోజుల పాటు కొనసాగే ఈ మహా కుంభమేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తున్నారు.…

Mahakumbh 2025: కుంభమేళాలో తొక్కిసలాట.. 17 మందికిపైగా మృతి!

ఉత్తరప్రదేశ్‌(UP)లోని ప్రయాగ్‌రాజ్‌(Prayagraj)లో జరుగుతున్న కుంభమేళా(Mahakumbh)లో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య(Moni Amavasya) సందర్భంగా పెద్దయెత్తున జనం తరలిరావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. త్రివేణీ సంగమం(Triveni Sangamam) సమీపంలోని సంగం ఘాట్ వద్ద భక్తులు(Devotees) పుణ్యస్నానాలు ఆచరించేందుకు తరలివచ్చేక్రమంలో భారీగా భక్తులు గుమిగూడారు. దీంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *