ముస్లీ సోదరులకు అండగా నిలుస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మల్లాపూర్ డివిజన్ (Mallapur Division) గ్రీన్‌హిల్స్ కాలనీలో ఎండీ అల్తాఫ్ ఆధ్వర్యంలో ఇప్తార్ విందు కార్యక్రమంలో ఉప్పల్ (Uppal)ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Bandari LaxmaReddy), కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డి (Pannala Devender Reddy) హజరయ్యారు.
ఉప్పల్ నియోజకవర్గంలో పేదల సంక్షేమం తాను రాజకీయాలకు అతీతంగా తాను పనిచేస్తానని ప్రజలకు భరోసా కల్పించారు. కుల, మతాలకు అతీతంగా రంజాన్ పర్వదినాన్ని ఐకమత్యంగా జరుపుకునే సంస్కృతి ఉప్పల్ ప్రజలకే సోంతంగా ఉందన్నారు.