రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనకాపల్లి దశ మారుస్తామని పవన్ మాటిచ్చారని మాజీ మంత్రి, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామ కృష్ణ తెలిపారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనకాపల్లి దశ మారుస్తామని జనసేన పార్టీ అధినేత పవన్ మాటిచ్చారని మాజీ మంత్రి, అనకాపల్లి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాలరామ కృష్ణ అన్నారు. ఈ మేరకు అనకాపల్లి పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో కలిసి కొణతాల మీడియా సమావేశం నిర్వహించారు.
అనకాపల్లిలో పవన్ సభను విజయజవంతం చేసినందుకు ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, ప్రజలంతా విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వారాహి విజయభేరి యాత్రలో పవన్ అనేక హామీలు ఇచ్చారని, యువతకు ఉపాధి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి, మూతపడిన చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ తమ ముందున్న సవాళ్లని పేర్కొన్నారు. కూటమి అభ్యర్థులను గెలిపిస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే జనసేన పోరాడుతోందని తెలిపారు.