Eatala: తెలంగాణలో 12 పార్లమెంట్​ స్థానాల్లో గెలుస్తున్నాం

స్వతంత్ర్యాన్ని తెచ్చిన పార్టీగా, రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో గెలవడం కోసం జిల్లాల వారీగా డిక్లరేషన్లు ప్రకటించారు. ప్రతిపక్ష పార్టీగా కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రశ్నించింది.


(KCR) కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేశారని మల్కాజ్​గిరి పార్లమెంట్​ అభ్యర్థి ఈటల రాజేందర్​ విమర్శించారు. కార్పొరేషన్లు పెట్టి, తప్పుడు GSDP ప్రకటించి FRBM పెంచుకున్నారని కాంగ్రెస్ నేతలు చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చే హామీలు అమలవుతాయో లేదో అన్న సోయ ఉండాలి. సోయి ఉండి, ఎన్ని అబద్ధాలైనా చెప్పి, అవగాహన ఉండి హామీలిచ్చారన్నది కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. అధికారం లేని నాడు ఒకమాట, ఉన్ననాడు మరో మాట మాట్లాడుతున్నారు.

అధికారం వస్తుందని కాంగ్రెస్ ఊహించలేదు. వచ్చిన తర్వాత తెలంగాణ యావత్ ప్రజానీకమంతా ధరణి సమస్యలతో బాధపడుతున్న అన్నమో రామచంద్రా అంటూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. దానిపై కమిటీ వేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ( Kaleswaram)కుంగిపోయినది నిజం. ప్రాజెక్టు కుంగిపోయింది.. కానీ ఏఏ ప్రాజెక్టుల్లో నీళ్లున్నాయన్నది చూసుకొని పంటలను కాపాడాల్సి ఉంది. చాలా కాలం తర్వాత నీళ్ల కోసం పరితపించాల్సి వస్తోంది. కళ్ల ముందు పంటలు ఎండిపోతున్నాయి. దీనికి ఎవరు కారణమో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.

కేసీఆర్ లా మాట్లాడితే ఉపయోగం ఏముంటుంది? అధికారంలో ఉన్న పార్టీ, ప్రతిపక్షాలు మాట్లాడే మాటలను పరిశీలించి, సూచనలు, సలహాలను తీసుకోవాలన్నారు. ఆనాడు కేసీఆర్ దానిని సహించలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి(CM Reventh Reddy) కూడా దీనిని సహించడం లేదు.
వెంటనే రెండు లక్షల రూపాయల రుణాలు తెచ్చుకోవాలని రేవంత్ చెప్పారు. ( వీడియో ప్లే చేసి చూపించారు) కేసీఆర్ అంతిస్తే, అంతకంటే ఎక్కువ ఇస్తానని హామీలిచ్చారు. పంటకు 500 బోనస్ ఇస్తానన్నారు. మహిళలకు ప్రభుత్వ ఉద్యోగికి వచ్చినట్టుగా 2 వేలిస్తానని రేవంత్ చెప్పారన్నారు. అనేక కష్టాలు, అవమానాలు ఎదుర్కొన్న ముఖ్యమంత్రి, మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తారనుకున్నా… 2 వేల పింఛన్ 4 వేలు చేస్తానన్నాడు.

దాని ఊసే లేదు. బస్సుల్లో ఉచిత ప్రయాణం తప్ప ఏమీ లేదు. అందులోనూ కొత్త బస్సుల్లేవ్… అనేక హామీలిచ్చారు. హామీలిస్తానన్న మాట నిజమే కానీ, కేసీఆర్ చిప్పచేతికిచ్చాడని చెప్పడం దారుణమన్నారు ఈటల. అప్పుల కోసం పోతున్నామన్నారు. కేంద్ర ఆర్థిక, హోం, ప్రధాన మంత్రిని కలిశారని… దేశంలో కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు పద్దతి ప్రకారం చేస్తాయన్నారు ఈటల. పార్టీలతో సంబంధం లేకుండా చేస్తారన్నారు. కేంద్రాన్ని నిందించే అవకాశం కూడా లేదన్నారు.

Share post:

లేటెస్ట్