Thummala| పంట భీమా పథకానికి ఆదర్శ రైతులే కీలకం..మంత్రి తుమ్మల

Mana Enadu: పంట భీమా పథకం అమలు చేయడంలో ఆదర్శరైతులు, రైతుల సంఘాల ప్రతినిధులే కీలకంగా ఉంటారని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

ఖరీఫ్ కార్యాచరణకు తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అయిందని వివరించారు.రుణమాఫీ పథకం విధివిధానాలపై చర్చించారు.ఖరీఫ్ 2024 నుండి అమలు అయ్యే పంటల భీమా విధివిధానాలపై దిశా నిర్ధేశం చేశారు. టెండర్లలో పేర్కొనే నిబంధనలు, ముందుకు వచ్చే కంపెనీలకు ఉన్న అర్హతలను గుర్తించడం జరుగుతుందని తెలిపారు.

గతంలో ఉన్న పాలసీలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. రైతులు పంటనష్టపోయిన సందర్భములో భీమా పథకం ఆదుకొనే విధంగా ఉండాలని మంత్రి తుమ్మల సూచించారు.

పచ్చిరొట్ట విత్తనాలను సబ్సిడీపై సరఫరాకు విధివిధానాల రూపకల్పన చేసి వెంటనే సరఫరా ప్రారంభిస్తామన్నారు. సరఫరాలో ఎక్కడా లోటుపాట్లు లేకుండా టీఎస్ సీడ్స్ (TS SEEDS) పర్యావేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.

మొదటి విడత పంటనష్ట పరిహారం రూ.15 కోట్లు పంపిణీ పూర్తి అయిందన్నారు. రెండోవిడత (ఏప్రిల్) మూడోవిడత (మే) జరిగిన పంట నష్ట వివరాలను వెంటనే అందజేయాలని వ్యవసాయశాఖ అధికారులను కోరారు.వరి కొయ్యలు కాల్చకుండా యుద్ధప్రాతిపదికన రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. అప్పటికి వినకపోతే సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తామన్నారు. వరికొయ్యలకు నిప్పు పెడితే అధికారులు జరిమానా విధించాలని అన్నారు.

మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న, జొన్న, పొద్దుతిరుగుడు కొనుగోళ్ళను వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ప్రకటించారు.ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కేటాయించిన భూములలో ఆధునిక సాంకేతికతతో పండ్లతోటల పెంపు మరియు నిర్వహణ బాధ్యతలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

మల్బరిసాగుకు అనుకూల ప్రాంతాలను ఎంపిక చేసి పట్టు పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.కేంద్ర ప్రభుత్వ పథకాలలో మ్యాచింగ్ గ్రాంటు బకాయి నిధుల విడుదలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చారు.

సహకారసంఘాలలో సభ్యుల గుర్తింపు మరియు పదవీకాలం ముగిసిన సంఘాల ఎన్నికల నిర్వహణకు సన్నద్దం కావాలన్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *