CBI: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎవరి ఫోన్లు విన్నారంటే..

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో విచారణ చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఏదేళ్ల కిత్రం నుంచే తెలంగాణ కేంద్రంగా ఫొన్​ ట్యాపింగ్​ చేస్తున్నట్లు విచారణలో అధికారులు ప్రాధమికంగా గుర్తించారు.
స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(SIB) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ల కేసులో సంచలన విషయం వెలుగులోకి వస్తున్నాయి. వజ్రాల వ్యాపారులు, బిజినెస్‌మెన్లు, సినీ ప్రముఖులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఫోన్లను కూడా ట్యాపింగ్‌ చేసినట్లు తెలుస్తోంది. . దీనిని అదునుగా చేసుకుని ప్రణీత్ రావు పలువురిని బెదిరించి డబ్బులు వసూలు చేశారు.

ఫొన్​ ట్యాపింగ్​ కేసులో అరెస్ట్​ కాబడిన అధికారులపై ACB ఫోకస్ చేసింది. అంతేగాకుండా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆక్రమ ఆస్తుల వివరాలు రాబట్టే పనిలో నిమగ్నం అయినట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ చేసిన పోలీసు అధికారుల లిస్ట్‌ను ఇప్పటికే ACB సిద్ధం చేసినట్లు తెలిసింది.

హవాలా ముఠాలు, గోల్డ్ షాప్ వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఫోన్లను కూడా ప్రణీత్‌ రావు అండ్‌ టీమ్ ట్యాప్ చేసింది. కాల్ రికార్డింగ్స్ విని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు దర్యాప్తు బృందం తేల్చింది. బెదిరించడంతో పాటు కేసులు పెడతామని సిటీ పోలీస్ వింగ్ టీమ్ భయబ్రాంతులకు గురి చేసినట్లు కూడా చెప్తున్నారు. విలాసవంతమైన విల్లాల్లో ఈ అధికారులు నివాసం ఉంటున్నట్లు కూడా తెలుస్తోంది. ఆఫీసర్ల ఆర్థిక పరిస్థితిపైనా ఏసీబీ ఆరా తీస్తోంది.

Share post:

లేటెస్ట్