Good News: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారా.. గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. 

New Ration Cards: కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే తెలంగాణ ప్రజలకు శుభవార్త వచ్చింది. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. దీనివల్ల ఎంతోమందికి ఊరట లభిస్తుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణలో తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఫిక్స్ చేసింది. కాగా, గత నెలలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఈ ప్రక్రియకు బ్రేకులు పడ్డాయి.

అయితే, తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో పథకాలకు రేషన్ కార్డు కీలకమనే సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయంలో ఎన్నోమార్లు అప్లికేషన్స్ పెట్టుకున్నా.. ఎంతకీ రేషన్ కార్డులు రాకపోవడంతో పథకాల ప్రయోజనాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్ అందించింది. తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులను త్వరలోనే ఇవ్వనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఆయన పాలేరులో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమంలో ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రకటించే 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని నొక్కి చెప్పారు.

Share post:

లేటెస్ట్