ఓటీటీలోకి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. మే 31 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ మూవీ జూన్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన చేసింది. తెలుగు,తమిళ్‌,కన్నడ,మలయాళంలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు తెలిపింది.

Gangs Of Godavari OTT Release Update : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి అంజలి ఫిమేల్ లీడ్స్ గా నటించారు. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్‌ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మే 31 న థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజైన ఈ సినిమా తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని మంచి ఓపెనింగ్స్ రాబట్టింది.

ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్న ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లోనే సుమారు 20 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇప్పటికీ పలు థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా రిలీజై నెల తిరక్కుండానే ఓటీటీలోకి వచ్చేస్తుంది. తాజాగా ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ జూన్‌ 14న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈమేరకు నెట్‌ఫ్లిక్స్‌ అధికారిక ప్రకటన చేసింది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ సినిమాని స్ట్రీమింగ్‌ చేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *