చైతన్య రావ్, హెబ్బా పటేల్ జంటగా నటిస్తున్న సినిమా “హనీమూన్ ఎక్స్ ప్రెస్”. ఈ చిత్రాన్ని న్యూ రీల్ ఇండియా బ్యానర్ పై కేకేఆర్, బాలరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ప్రయోగాత్మకంగా ఫ్యూచరిస్టిక్ రొమాంటిక్ కామెడీ గా దర్శకుడు బాల రాజశేఖరుని రూపొందించారు. హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఈ నెల 21న వరల్డ్ వైడ్ థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఈ రోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
లవర్స్, పెళ్లి చేసుకోబోయే వాళ్లు, పెళ్లి చేసుకున్నకొత్త జంట, పెళ్లై ఇరవై ఏళ్లయిన జంటలు ప్రతి ఒక్కరికీ నచ్చేలా హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమా ఉంటుంది. వాళ్లందరికీ రిలేట్ అయ్యే అంశాలుంటాయి. అలాగని ఈ సినిమాలో సందేశం చెప్పడం లేదు. ఎంటర్ టైనింగ్ గా సినిమాను రూపొందించారు. దర్శకుడు, హెబ్బాతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉందన్నారు హీరో. మ్యూజిక్ డైరెక్టర్ కల్యాణి మాలిక్ సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీ సాంగ్స్ నా ఫేవరేట్ అయ్యాయి.
సమర్పణ : ఎన్ ఆర్ ఐ ఎంటర్టైన్మెంట్స్ (యు ఎస్ ఎ) (NRI Entertainments (USA))
బ్యానర్ : న్యూ రీల్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (New Reel India Entertainments Pvt Ltd)
చిత్రం పేరు : హనీమూన్ ఎక్స్‌ప్రెస్
నటీనటులు : చైతన్య రావు, హెబ్బా పటేల్, తనికెళ్ల భరణి, సుహాసిని, అరవింద్ కృష్ణ, అలీ, సురేఖ వాణి, రవి వర్మ, తదితరులు
సంగీతం : కళ్యాణి మాలిక్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ఆర్ పి పట్నాయక్,లిరిక్స్ : కిట్టూ విస్సాప్రగడ,ఆర్ట్, సినిమాటోగ్రఫీ : శిష్ట్లా వి ఎమ్ కె,ఎడిటింగ్ : ఉమా శంకర్ జి (యు ఎస్ ఎ), శ్రీ కృష్ణ అత్తలూరి,ఆడియో : టి సిరీస్,పి ఆర్ ఓ : పాల్ పవన్
డిజిటల్ పి ఆర్ ఓ : వంశి కృష్ణ (సినీ డిజిటల్), రచన, దర్శకత్వం : బాల రాజశేఖరుని