Devara- Jr Ntr : ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్ గా రూపుదిద్దుకుంటుంది. జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. తొలి భాగం దేవర పార్ట్ 1 సినిమా రెండు వారాల ముందుగానే విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. వాస్తవానికి ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేయనున్నట్లు గతంలో తెలిపింది.
పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సెప్టెంబర్ 27న విడుదల కావాల్సి ఉంది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ బిజీగా ఉండడం, ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ప్రస్తుతం సినిమాలకు కొంత విరామం ఇచ్చాడు. దీంతో అనుకున్న సమయానికి ఓజీ షూటింగ్ పూర్తి కావడం కష్టమే. పవన్ సినిమా విడుదల కావడం అనుమానంగా మారడంతోఆ తేదీని ఎన్టీఆర్ లాక్ చేసుకున్నారు. చెప్పిన తేదీ కంటే రెండు వారాలు ముందుగానే వస్తుండడంతో ఎన్టీఆర్ అభిమానులు తెగ సంతోషపడిపోతున్నారు.