Darling: ప్రియదర్శి ‘డార్లింగ్‌’..OTTలో స్ట్రీమింగ్ అప్పటి నుంచే

Mana Enadu: ప్రియదర్శి, నభా నటేష్ హీరో హీరోయిన్స్ గా నటించిన ‘డార్లింగ్‌’ మూవీ కామెడీ ఎంటర్టైనర్ గా జులై 19 న సిల్వర్​ స్క్రీన్​పై విడుదల అయింది. అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనన్య నాగళ్ల, మొయిన్, శివా రెడ్డి, మురళీధర్ గౌడ్, కళ్యాణి రాజ్, సునీత మనోహర్, ముళ్లపూడి రాజేశ్వరి, అభిజ్ఞ, జీవన్, కృష్ణ తేజ, విష్ణు, సంజయ్ స్వరూప్, రఘు బాబు, ప్రియాంక, స్వప్నిక, శివరంజని కీలక పాత్రలు పోషించారు.


ఇప్పటి వరకు థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ‘డార్లింగ్‌’ ఓటీటీ రిలీజ్ డేట్ చేశారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ లో ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. ప్రైమ్ షో ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు.

ప్రియదర్శి, నభా నటేశ్‌ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డార్లింగ్‌’. ఇటీవలే థియేటర్స్ లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ హాట్ స్టార్ లో ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *