Mana Enadu: మహా మూవీస్ మరియు ఎమ్ 3 మీడియా పతాకంపై వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో ఆద్యంత్ హర్ష దర్శకత్వంలో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించిన చిత్రం “విరాజి”. ఈ చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది.
“విరాజి” మూవీలో నా లుక్ కొత్తగా ఉండేలా మా డైరెక్టర్ ఆద్యంత్ హర్ష డిజైన్ చేశారు. రెండు డిఫరెంట్ కలర్స్ లో వెరైటీగా హెయిర్ స్టైల్, ముక్కు పుడక, టాటూస్ తో ఒక కొత్త మేకోవర్ చేయించారు. నాకు కథ కంటే ముందు నేను ఈ సినిమాలో చేసిన ఆండీ క్యారెక్టర్ లుక్ ఎలా ఉంటుందో డైరెక్టర్ వివరించారు. సినిమా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు ప్రమోషన్ కోసం మళ్లీ ఆ లుక్ లోనే కనిపిస్తున్నా. మీకు త్వరగా రిజిస్టర్ అయ్యి రీచ్ అవ్వాలంటే కొత్తగా కనిపించాలి.
ఈ కథలో అంతర్లీనంగా సోషల్ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమాలో నా లుక్ చూసి రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా వస్తున్నాయి. కానీ వాటికి ఈ సినిమానే సమాధానం చెబుతుంది. “విరాజి” సినిమా చూశాక నేను ఎందుకు ఈ మేకోవర్ లో ఉన్నాను అని తెలుసుకుంటారు. ఈ సినిమా చూశాక ఆండీ క్యారెక్టర్ పట్ల గర్వపడతారు.
“విరాజి” సినిమా చూశాక ఎమోషనల్ అయ్యాను. చివరలో హార్ట్ టచింగ్ గా అనిపించింది. నా వైఫ్ వితిక కూడా సినిమా చూసి అలాగే ఫీలయ్యింది. ఈ సినిమాలో సగం తెలుగు సగం ఇంగ్లీష్ మాట్లాడుతుంటా. ఇది నా బాడీ లాంగ్వేజ్ కు కంఫర్ట్ గా అనిపించింది. ప్రతి సినిమాకు, క్యారెక్టర్ కు నేనెంతవరకు అడాప్ట్ అవగలనో అంతవరకు ప్రయత్నిస్తుంటాను.
– కథ బాగుండి, క్యారెక్టర్ నచ్చితే ఏ సినిమా అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. మంచి స్టోరీ ఉంటే వెబ్ సిరీస్ ల్లోనూ నటించాలని ఉంది. మైఖేల్ సినిమాలో విలన్ గా కనిపించాను. నాకు ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలనే పరిమితులు ఏవీ లేవు. “విరాజి” ఒక మంచి సినిమా. దీనికి మీ సపోర్ట్ అందిస్తారని కోరుకుంటున్నా