Mana Enadu: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘మిస్టర్ బచ్చన్’.ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు జగపతిబాబు, సచిన్ ఖేడేకర్ కీ రోల్ పోషిస్తున్నారు. ఇప్పటికే విడదలైన ‘సితార్’ అంటూ సాగిన మెలోడియస్ పాట.. ‘రెప్పల్ డప్పుల్’ అంటూ వచ్చిన మాస్ మసాలా సాంగ్ యూట్యూబ్‌ను ఊపేస్తున్నాయి.
మరోవైపు నాలుగు రోజుల క్రితం రిలీజైన టీజర్ ఈ మూవీపై ఎక్సపక్టేషన్స్‌ను ఏ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ముఖ్యంగా రవితేజ చెప్పిన ‘‘సక్సెస్, ఫెల్యూర్స్ ఇంటికొచ్చే చుట్టాలాంటివి వస్తుంటాయ్.. పోతుంటాయ్. కానీ ఆటిట్యూట్ ఇంటిపేరు లాంటిది అది పోయేదాక మనతోనే ఉంటాయ్’’ అనే మాస్ డైలాగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు రెడీ అయింది. అయితే ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ కోసం ప్రీమియర్స్‌ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఈ సినిమా రిలీజ్‌కి ముందురోజైన ఆగస్టు 14న సాయంత్రం 6 గంటలకు పలు నగరాల్లో ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ వేయబోతున్నట్లుగా సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాను అందరికంటే ఒకరోజు ముందుగానే వీక్షించాలని రవితేజ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్ సరికొత్తగా స్టార్ట్ చేసింది. హైదరాబాద్ మెట్రోలో అనౌన్స్‌మెంట్‌లో ‘తలుపు ఎడమవైపున తెరుచుకుంటుంది’ అని మాత్రమే వింటోన్న ప్రయాణికులను రవితేజ వాయిస్‌తో సర్‌ప్రైజ్ చేసింది. అందులో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా రిలీజ్ గురించి ప్రయాణికులకు తెలియజేస్తూ ఆగస్టు 15న మూవీ చూడాలని రవితేజ కోరారు. దీంతో అభిమానుల్లోనూ ఈ మూవీ తెగ హైప్ క్రియేట్ చేసింది. చూడాలి.. మరి 15న రానున్న ఈ మిస్టర్ బచ్చన్.. ఫ్యాన్స్‌ను ఏ రేంజ్‌లో ఎంటర్‌టైన్ చేస్తుందో..