సిటాడెల్ కోసం ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో సమంత..  హనీ బన్నీ వచ్చేది అప్పుడే.. బీ రెడీ

Mana Enadu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి ఈ భామ నటించిన ‘సిటడెల్‌ : హనీ బన్నీ’ వెబ్ సిరీస్ టీజర్ ను తాజాగా విడుదల చేశారు. ఈ టీజర్ లో సమంత యాక్షన్ అదిరిపోయింది. ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని పాత్రలో సామ్ ని చూడబోతున్నట్లు ఈ టీజర్ చూస్తే తెలిసిపోతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ ఫేం రాజ్ అండ్ డీకే ధ్వయం ఈ సిరీస్ ను తెరకెక్కించారు. నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు, భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్‌ అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

ఇక ఈ వెబ్ సిరీస్ కోసం సామ్ స్పెషల్ గా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంది. ఈ వీడియోలో సామ్ ఫైట్స్ చూస్తే తెలిసిపోతుంది ఎంత ప్రొఫెషనల్ గా ఉన్నాయో. డూప్ లేకుండా సమంత స్వయంగా యాక్షన్ సీక్వెన్స్ చేసిందట. అంతేకాదు.. 12 నిమిషాల నిడివి గల యాక్షన్‌ సీన్‌ను సింగిల్‌ టేక్‌లో చిత్రీకరించారట. తాజాగా ముంబయిలో ఈ సిరీస్ టీజర్ రిలీజ్ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇందులో పాల్గొన్న సమంతను  లైఫ్ లో క్లిష్ట సమయాలను ఎలా ఎదుర్కొన్నారు? అని విలేకరి ప్రశ్నించగా.. ‘‘కొన్నిసార్లు నేనూ చేతులెత్తేస్తాను. అయితే, అక్కడితో కథ ముగిసిపోయినట్లు కాదు. నేను తిరిగి పైకి లేస్తా’’ అని బదులిచ్చింది. మరోవైపు సిటాడెల్ గురించి మాట్లాడుతూ.. యాక్షన్‌ ప్రియులకు ఈ సిరీస్ తప్పకుండా నచ్చుతుందని చెప్పుకొచ్చింది. ఇప్పుడు సమంత కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. స్ట్రాంగ్ గర్ల్ అంటూ నెటిజన్లు సామ్ ను పొగిడేస్తున్నారు.

ఇక రాజ్‌, డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో కేకే మేనన్‌, సిమ్రన్‌, సోహమ్‌ మజుందార్‌  కీలక పాత్రలు పోషించారు.  1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని తెలుస్తోంది. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించిన విషయం తెలిసిందే. 

 

Related Posts

OTT: ఓటీటీలో సందడి చేయనున్న కుబేర.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్​ కమ్ముల(Shekar Kommala) దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్(Dhanush) నటించిన తాజా చిత్రం ‘కుబేర’(Kubera). ఈ చిత్రం జూన్ 20న విడుదలై ఊహించని రీతిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కింగ్ నాగార్జున (Nagarjuna), పాన్ ఇండియా…

Akhanda2: అఖండ 2 కోసం రికార్డు స్థాయి బడ్జెట్.. బాలయ్య బిగ్ రిస్క్!

నందమూరి బాలకృష్ణ(Balakrishna), బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ  2’ (Akanda2) సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.. వరుసగా నాలుగు హిట్లు కొట్టి మంచి ఫామ్‌లో ఉన్న బాలయ్య బాబు, ఇప్పుడు తన బ్లాక్‌బస్టర్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *