Upendra| నా జీవితంలో మర్చిపోలేని చిత్రం- A సీక్వెల్ చేయబోతున్నాను-హీరోయిన్ చాందిని

Mana Enadu: దాదాపు రెండు దశాబ్దాల క్రితం కన్నడలో సంచలన విజయం సాధించిన చిత్రం” A .”అప్పట్లో దాదాపు 365 రోజులు కన్నడలో ప్రదర్శింపబడి ఆశ్చర్యపరిచిన” A” తాజాగా మూడు వారాల క్రితం రిలీజ్ అయ్ అంతే సంచలనాన్ని క్రియేట్ చేసింది.

దాదాపు మార్నింగ్ నుంచి బారులు తీరి జనాలు ఈ సినిమాను వీక్షించారు .తాజాగా ఈ చిత్రం నిన్న తెలుగు రాష్ట్రాలలో రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ లింగం యాదవ్ ఆధ్వర్యంలో ప్రెస్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా ప్రముఖ బిజెపి లీడర్ రామచంద్రరావు, లింగం యాదవ్ ,సురేష్ లతో పాటు హీరోయిన్ చాందిని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “A “చిత్రంలో నేను నటిస్తారని ఊహించలేదు. దాదాపు 300 మంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి లాస్ట్ లో నన్ను తీసుకోవడం జరిగింది .అప్పటినుంచి ఇప్పటివరకు నన్ను ప్రేక్షకులు ఈ చిత్రంలో హీరోయిన్ గానే గుర్తించడం నాకు ఆనందంగా ఉంది .మా డిస్ట్రిబ్యూటర్ లింగం యాదవ్ గారు ఈ చిత్రాన్ని 4k చేసి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు మరోసారి ఈ చిత్రాన్ని అందించినందుకు థాంక్స్ చెప్తున్నాను .

అలాగే మాకు ఇంతటి విజయాన్ని దశాబ్దాల నుంచి అందించిన ఈ చిత్రం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాము. మా హీరో ఉపేంద్ర గారితో కూడా చర్చలు జరిగాయి. మా రైటర్స్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్ విషయాలు త్వరలో మీకు అఫీషియల్ గా వెల్లడిస్తాను. అన్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *