అక్టోబర్‌లో ఎటాక్‌కి సిద్దమవుతున్న రజినీకాంత్. అయితే ఆ ఎటాక్ రామ్ చరణ్ మీద అయ్యేలా కనిపిస్తుంది.
Vettaiyan : జై భీం డైరెక్టర్ టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన 170వ సినిమా ‘వెట్టియాన్’ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దసరా విజయన్, రక్షన్.. వంటి భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ఈ చిత్రాన్ని అక్టోబర్ లో రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాతలు నేడు అనౌన్స్ చేశారు. అయితే కచ్చితమైన డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. అక్టోబర్ లో రెండు పండగలు ఉన్నాయి. అక్టోబర్ స్టార్టింగ్ లో దసరా ఉంటే.. చివరి రోజులో దీవాళీ ఉంది. ఈ రెండు పండగల్లో రజినీకాంత్ ఎప్పుడు రాబోతున్నారో అన్నది తెలియాల్సి ఉంది. కాగా దీవాళీ పండక్కి వచ్చేందుకు రామ్ చరణ్ ఇప్పటికే డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తున్న టాక్.
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ని దీవాళీ కానుకగా అక్టోబర్ 31న రిలీజ్ చేయడానికి ఆల్మోస్ట్ నిర్మాత దిల్ రాజు డేట్ ని ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఒకవేళ రజినీకాంత్ ‘వెట్టియాన్’ దీవాళీకి వస్తే.. రామ్ చరణ్ కి పోటీ తప్పదు. గేమ్ ఛేంజర్ ని శంకర్ డైరెక్ట్ చేస్తుండడంతో.. తమిళంలో కూడా భారీగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. రజిని సినిమా ఉంటే భారీగా రిలీజ్ చేయడం కష్టం అవుతుంది. మరి రజిని ఏ పండక్కి వస్తారో చూడాలి.