మేడారం జాతర.. విద్యార్థులకు 5 రోజులు సెలవులు..

తెలంగాణ కుంభమేళ మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ములుగు జిల్లాలో 4రోజులు పాఠశాలలు సెలవు ప్రకటిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు జిల్లాకలెక్టర్ . అదివారం సెలవుతో కలిపి వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. 21వ తేదీ నుంచి 24వరకు ఈ జాతర జరగనుంది.

ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం అయింది. జాతర ఫిబ్రవరి 21 నుంచి మొదలై 24వ తేదీ వరకు సాగనుంది. ఈ జాతరకు సంబంధించి ఇప్పటికే అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నీ చేశారు. రవాణా పరంగానూ తెలంగాణ ఆర్టీసీ (TSRTC) 6వేల స్పెషల్ బస్సులను కూడా నడుపుతోంది. ఇటు మేడారం జాతరకు వచ్చే భక్తులకోసం జంపన్న వాగు, పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు.

కాగా మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాల్లోని (Mulugu District) పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. 4 రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. 4 రోజులుపాటు జిల్లాలో ఉన్న విద్యాసంస్థలు మూసివేయాలని ఆదేశించారు. ఆదివారం సెలవు కావడంతో వరుసగా 5రోజుల పాటు సెలవులు వచ్చాయి. సమ్మక్క సారక్క జాతరను (Sammakka Sarakka Jatara) తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తూ..2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారం జాతరను రాష్ట్ర పండుగగా (Telangana State Festival) గుర్తించారు. అయితే మేడారం జాతీయ జాతీయ హోదాను కల్పించాలంటూ ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తూనే ఉంది.

ఇక ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్న ఈ జాతరకు కోటికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్దెత్తున తరలివస్తారు. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఫిబ్రవరి 21,22,23,24వ తేదీల్లో ప్రభుత్వ ప్రైవేట్ విద్యా సంస్థలతోపాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలువు ప్రకటించినట్లు ఆదేశాలు జారీ చేశారు.

Related Posts

JNV: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. మరోసారి నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తు గడువు పెంపు

విద్యార్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా ఉన్న జవరహర్ నవోదయ విద్యాలయాల్లో (JNV) 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు(Application Deadline)ను అధికారులు మరోసారి పొడిగించారు. అర్హులైన, ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆగస్టు 27వరకు దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం కల్పించారు. 2026- 27…

TG TET: తెలంగాణ టెట్​ రిజల్ట్స్​ వచ్చేశాయ్​..

తెలంగాణ టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీజీ టెట్) (TG TET) రిజల్ట్స్​ వచ్చేశాయి. సచివాలయంలో మంగళవారం ఉదయం 11గంటలకు విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా రిలీజ్ చేశారు. జూన్ 18 నుంచి 30వ తేదీల మధ్య ఆన్లైన్ పరీక్షలు జరిగాయి. మొత్తం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *