Mana Enadu: ఇండియాలోనే అత్యధిక సంపద కలిగిన వ్యక్తిగా మళ్లీ ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Goutam adani) నిలిచారు. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ -2024(Hurun India Rich List) తాజాగా వెల్లడించిన జాబితాలో అదానీ తరువాత స్థానంలో రిలయన్స్ ఇండస్ట్రీస్( Reliance Industries) చైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) నిలిచారు. అదానీ నికర సంపద విలువ ఏడాదికాలంలో 95శాతం పెరిగింది. దీంతో ఆయన సంపద రూ. 11.61లక్షల కోట్లకు చేరింది. ముకేశ్ అంబానీ నికర విలువ 25శాతం వృద్ధితో రూ.10.14లక్షల కోట్లకు చేరింది. తొలిసారి ఈ జాబితాలో అనేక మంది పారిశ్రామిక వేత్తలు, సినీ, రాజకీయ ప్రముఖులు చేరారు. బాలీవుడ్ ప్రముఖుల్లో షారూక్ ఖాన్, జూహి చావ్లా, అమితాబ్ బచ్చన్, హృతిక్ రోషన్, కరణ్ జోహార్‌లు ఈ సారి జాబితాలో చోటు దక్కించుకున్నారు.
మూడో స్థానంలో హైదరాబాద్
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 జాబితా ప్రకారం ఇండియాలో అత్యధిక బిలియనీర్లు కలిగిన నగరాల్లో హైదరాబాద్ దూసుకెళ్తుంది. దేశంలోనే ఎక్కువ మంది సంపన్నులున్న నగరాల జాబితాలో మొదటి స్థానంలో ముంబై (386 మంది) నిలిచింది. రెండో స్థానంలో ఢిల్లీ (217 మంది) రెండో స్థానంలో ఉంది. ఇక 3వ స్థానంలో హైదరాబాద్ నగరం నిలిచింది. భాగ్యనగరంలో 104 మంది సంపన్నులు ఉన్నారు.
దేశంలో TOP-10లో ఉన్న సంపన్నులు వీరే
1. గౌతమ్ అదానీ- రూ.11,61,800 కోట్లు
2. ముకేశ్ అంబానీ- రూ.10,14,700 కోట్లు
3. శివ్ నాడార్- రూ.3,14,000 కోట్లు
4. సైరస్ S పూనావాలా- రూ.2,89,800 కోట్లు
5. దిలీప్ సింఘ్వీ- రూ.2,49,900 కోట్లు
6. కుమార్ మంగళం బిర్లా- రూ.2,35,200 కోట్లు
7. గోపిచంద్ హిందూజా- రూ.1,92,700 కోట్లు
8. రాధాకిషన్ దమాని- రూ.1,90,900 కోట్లు
9. అజీజ్ ప్రేమ్‌జి- రూ.1,90,700 కోట్లు
10. నీరజ్ బజాజ్- రూ.1,62,800 కోట్లు
”వైఫ్’ను ఎంతసేపు చూస్తారు..? సండే కూడా ఆఫీసుకు రండి’
భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే యువత వారానికి 70 గంటలు చొప్పున పని చేయాలంటూ ఇన్ఫోసిస్ (Infosys) సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన కామెంట్స్ పెద్ద చర్చకు దారి తీశాయి. చాలా మంది ఈ…